Telangana Rains : తెలంగాణాలో రాగల మూడు రోజులు వర్షాలు
తెలంగాణాలో రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాలలో కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాయలసీమ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1-5.8 కి.మీ ఎత్తు మధ్యలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీనపడింది.

Telangana Rains
Telangana Rains : తెలంగాణాలో రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాలలో కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాయలసీమ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1-5.8 కి.మీ ఎత్తు మధ్యలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీనపడింది.
రాగల మూడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాసం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ రోజు కొన్ని ప్రాంతాలలో అక్కడక్కడ గంటకు 30 నుండి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.