Banner for 2nd Wife: ఎన్నికల్లో పోటీ చేయటానికి రెండో భార్య కావాలి’..బ్యానర్లు కట్టి ప్రకటన

ఎన్నికల్లో పోటీ చేయటానికి నాకు రెండో భార్య కావాలి’..అంటూ ఓ వ్యక్తి బ్యానర్లు కట్టిమ మరీ ప్రకటించాడు. బ్యానర్ లో కొన్ని షరతులు కూడా పెట్టాడు. తన ఫోన్ నంబర్ ఇచ్చి మరీ ప్రకటించాడు.

Aurangabad Man Banner  Second wife To Contest Election Candidate (1)

Aurangabad man banner  Second wife to contest Election candidate :  రెండో పెళ్లి చేసుకోవాలంటే ఏ మగాడైనా ఏవేవో కారణాలు చెబుతాడు. తన పిల్లల్ని చూసుకోవటానికని..లేదా ఇంటిని..తనను చూసుకోవటానికి అని చెబుతాడు. దాని కోసం ఏ పెళ్లిళ్లు పేరయ్యకో చెబుతాడు. లేదా మ్యాట్రిమోని సెంటర్లలోనో ప్రకటన ఇస్తాడు. కానీ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఓ వ్యక్తి మాత్రం ఏకంగా తనకు రెండో భార్య కావాలంటూ ఓ బ్యానరే కట్టేసి మరీ ప్రకటించారు. ఇంతకీ అతనికి రెండో భార్య ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..ఎందుకంటే ‘ఎన్నికల్లో పోటీ చేయటానికి రెండో భార్య కావాలట..! అదికూడా మొదటిభార్య పిల్లలు ఉండగా..ఏంటీ..ఓరి వీడి అసాధ్యం కూలా? ఇదేం ప్రకటనరా బాబూ అనుకుంటున్నారా?

Also Read : wife without Makeup : మేకప్‌ లేకుండా భార్యను చూసి భర్త షాక్..విడాకులు కావాలంటూ కోర్టుకు

నిజమే మరి ఎన్నికల్లో పోటీ చేయటానికి రెండో పెళ్లి చేసుకోవటమేంటీ? మొదటిభార్యనే ఎన్నికల్లో పోటీ చేయించొచ్చుగా అనుకుంటున్నారా? నిజమే కానీ ఇక్కడో చిక్కొచ్చి పడింది. అందుకే రెండో భార్య కావాలంటున్నాడీ ప్రబుద్ధుడు. పైగా బ్యానర్ కట్టి మరీ ప్రకటించటానికి కారణమేమంటే..

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలు జరుగనున్నాయి. గుల్మండి ప్రాంతానికి చెందిన రమేశ్‌ పాటిల్‌ అనే వ్యక్తి ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాడు. రమేశ్ కు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. దీంతో ముగ్గురు పిల్లలు ఉండటం వల్ల ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోయాడు రమేశ్. కానీ ఎలాగైనా ఎన్నికల్లో పోటీ చేయాలని ఎంతో ఆశగా ఉన్నాడు. దానికి ఓ ఐడియా వేశాడు.

Also Read : Viral Video: మటన్ కర్రీ చేస్తున్న భార్య..రొమాంటిక్ భర్త కొంటె పని

తాను ఎన్నికల్లో పోటీ చేయలేకపోయినా..తన కుటుంబంలో నుంచి ఎవరో ఒకరిని పోటీలో నిలబెట్టాలనుకున్నాడు. రెండో పెళ్లి చేసుకుని అయినా సరే ఆమెను వచ్చే కొత్త భార్యను ఎన్నికల్లో పోటీ చేయించాలని నిర్ణయించుకున్నాడు. అక్కడితో ఈయనగారి క్రియేటివిటీ ఆలోచనలు ఆగలేదు. ఏకంగా రెండో భార్య కావాలంటూ బ్యానర్ కట్టి మరీ ప్రకటించాడు రమేశ్.‘‘ఎన్నికల్లో పోటీ చేయటానికి తనకు రెండో భార్య కావాలి’’అంటూ ఏకంగా ఔరంగాబాద్‌ సిటీ అంతా బ్యానర్లు కట్టించాడు. తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో బ్యానర్ లో షరతులు కూడా రాయించాడు.

Also Read : Viral Video : మెక్‌డొనాల్డ్స్‌లో మహిళ హల్‌చల్.. కాఫీ ఇవ్వలేదని రచ్చ రచ్చ

ఇంతకు ముందే వివాహం అయిన మహిళ అయినా ఫరవాలేదు. కానీ ఆ మహిళకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలనే షరతు కూడా విధించాడు. తన ఫోన్‌ నంబర్‌ సైతం బ్యానర్లలో వేయించాడు. ఇప్పుడు ఆయన ప్రకటనపైనే నగర జనాలే కాదు..సోషల్ మీడియాలో ఈ బ్యానర్ వైరల్ కావటంతో సదరు రమేశ్ గాని ఎన్నికల పైత్యం బాగా ముదిరిందే అనుకుంటున్నారు.