wife without Makeup : మేకప్‌ లేకుండా భార్యను చూసి భర్త షాక్..విడాకులు కావాలంటూ కోర్టుకు

అందంగా ఉందని ఆమెనే పెళ్లి చేసుకోవాలని వెంటపడి మరీ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తరువాత మేకప్‌ లేకుండా భార్యను చూసి షాక్డా అయ్యాడు. విడాకులు కావాలంటూ కోర్టుకు వెళ్లాడు

wife without Makeup : మేకప్‌ లేకుండా భార్యను చూసి భర్త షాక్..విడాకులు కావాలంటూ కోర్టుకు

Man Divorces Wife After Seeing Her Without Makeup

ఈజిప్టు కు చెందిన 34 ఏళ్ల వ్యక్తి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉంటున్నాడు. అతనినికి ఫేస్ బుక్ లో ఓ అమ్మాయి పరిచయం అయ్యింది. ఇద్దరు తరచు చాటింగ్ చేసుకునేవారు. ఆ అమ్మాయి అందం అతనికి తెగ నచ్చేసింది. దాంతో ఇద్దరు ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకుని మాట్లాడుకునేవారు. అలా ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఆమె అందానికి ఫిదా అయిపోయిన అతను ఆమెను నేరుగా కలిసేందుకు తహతహలాడిపోయేవాడు. అలా ఇద్దరు కలిసి పలుమార్లు డేటింగ్‌కు కూడా వెళ్లారు. అలా ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆమెతో హ్యాపీగా ఉండొచ్చని ఆమెను చక్కగా చూసుకుందామని తెగ సంబరపడిపోయాడు. పెళ్లి అయ్యింది.

Read more : రుతుక్రమం సమయంలోనే పెళ్లి చేసుకున్న యువతి..మహా పాపం చేశావ్ అంటూ..విడాకులు కోరిన భర్త

పెళ్లయిన తరువాత రెండు మూడు రోజులకు ఇద్దరు షార్జాలోని అల్ మమ్‌జార్ బీచ్‌ కలిసి స్నానాలు చేశారు. దీంతో ఆమె మేకప్ కరిగిపోయింది. అంతే భార్యను చూసి షాక్ అయ్యాడు. మేకప్ భార్యను చూసిన అతనికి దిమ్మ తిరిగిపోయింది. ‘నిన్నమొన్నటి వరకు నేను చూసింది ఈమెనేనా?’ ఫేస్ బుక్ లో అంత అందంగా ఉంది..పెళ్లి అయ్యాక కూడా అందంగానే ఉంది. ఇప్పుడేంటీ ఇలా ఉందీ? అని పదే పదే అనుకున్నాడు. విషయం ఏంటీ అని అడిగి తెలుసుకున్నాడు. గతంతో ఆమె అందానికి కారణం ఆమె వేసుకున్న మేకప్ అని తెలుసుకున్నాడు. మేకప్ లేకపోతే ఇలా ఉంటుందా? అని షాక్ అయ్యాడు.

Read more : Marriage Again : విడాకుల కోసం వచ్చిన జంటకు మళ్లీ పెళ్లి చేసిన కోర్టు

అంతే.. నాకు నువ్వు వద్దు విడాకులు ఇచ్చేస్తానంటూ ఫ్యామిలీ కోర్టులో డివోర్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. విచారణ సమయంలో “పెళ్లికి ముందు ఆమె మేకప్ వేసుకుందని..మేకప్ లేకుండా ఆమెను చూసి షాక్ అయ్యానని కానీ ఆమెతో కలిసి ఉండటానికి నెల రోజులుగా యత్నిస్తున్నానని కానీ ఆమెను కలిసి జీవించటం నా వల్ల కాదని నేను మోసపోయాను కాబట్టి నాకు విడాకులు ఇప్పించండీ అంటు కోర్టుకు విన్నవించుకున్నాడు.

భర్త మాటలు..తనకు విడాకులు ఇవ్వటానికి చెప్పిన కారణాలు విన్న ఆమె కుమిలిపోయింది. అందం చూసా నన్ను పెళ్లి చేసుకున్నావు? అందమే శాశ్వతమా? అని ప్రశ్నిస్తోంది. కానీ అవేవీ నాకు అవసరం లేదు నాకు విడాకులే కావాలని అతను పట్టుబడుతున్నాడు.