Marriage Again : విడాకుల కోసం వచ్చిన జంటకు మళ్లీ పెళ్లి చేసిన కోర్టు

విడాకుల కోసం కోర్టుకెక్కిన దంపతులకు వైవాహిక బంధంలోని గొప్పతనాన్ని తెలియజెప్పి మళ్లీ పెళ్లి చేసి పంపించింది ధర్మాసనం.

Marriage Again : విడాకుల కోసం వచ్చిన జంటకు మళ్లీ పెళ్లి చేసిన కోర్టు

National Lok Adalat Re Marry A Couple

National Lok Adalat Re Marry a Couple : వివాహం అయిన పిల్లలు పుల్లలు పుట్టిన జంట విభేదాలు వచ్చి విడాకులు తీసుకోవటానికి కోర్టు మెట్లు ఎక్కుతారు. ఇక మేం కలిసి ఉండలేం మాకు విడాకులు ఇప్పించండీ అని కోరుతు..విడాకులు కావాలని అడుగుతారు. దానిని విచారించిన కోర్టు కారణాలు వగైరాలు అడుగుతుంది. సబబే అనిపిస్తే విడాకులు ఇస్తుంది. కానీ దంపతులు విడిపోవటానికి ముందు కొంతకాలం కలిసి ఉండాలని అప్పటికీ వారి మధ్య సయోధ్య కుదరకపోతే అప్పుడు సదరు జంటకు కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. అంటే దంపతులు కలిసి ఉండాలనే ధర్మాసనం భావిస్తుంది. కానీ తప్పనిసరి అయితేనే విడాకులు మంజూరు చేస్తుంది. అది వారి వారి ఇష్టప్రకారం.

Read more : విడాకులు తీసుకున్న అమీర్ ఖాన్ – కిరణ్ రావు!

కానీ..ఒడిశాలో కోర్టు ఓ విడాకుల కేసు విషయంలో ఓ అడుగు ముందుకేసి విడాకుల కావాలని వచ్చిన జంటకు న్యాయస్థానం సాక్షిగా మళ్లీ వివాహం జరిపించి విడిపోదామనుకున్న దంపతుల్ని జంటగా పంపించింది. వివాహం జరిగిన రెండేళ్లలే అభిప్రాయబేధాలతో విడిపోదామని వచ్చిన జంటకు న్యాయస్థానం వైవాహిక బంధంలోని గొప్పతనాన్ని తెలియజెప్పి మళ్లీ పెళ్లి చేసి పంపించింది ఒడిశాలోని జయపురంలో.

Read more : ప్రపంచంలో ఫస్ట్ టైమ్ : భర్త స్నానం చెయ్యడం లేదని విడాకులు

మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకోవాలని ఓ జంట కోర్టుకెక్కింది. విడాకులు కోరడం వెనకున్న కారణాలు తెలుసుకుని విడాకులు మంజూరు చేయడమో, లేదంటే కుదరదని చెప్పడమో చేయాల్సిన కోర్టు వారిద్దరికీ కోర్టులో మళ్లీ పెళ్లి జరిపించి మనస్పర్థలను పటాపంచలు చేసింది.

ఒడిశాలోని జయపురంలో బొరిగుమ్మ సమితి కుములి పంచాయతీలోని పాత్రపుట్ గ్రామానికి చెందిన ఫల్గుణి-అనిత భార్యాభర్తలు. వీరికి 2016లో వివాహం జరిగింది. అప్పటినుంచి వారి వైవాహిక బంధం బాగానే సాగింది. పెళ్లి జరిగి రెండేళ్లు దాటింది. వారి బంధానికి గుర్తుగా ఓపాప జన్మించింది. ఆ తర్వాత వీరిమధ్య అభిప్రాయబేధాలు రావటం ప్రారంభించాయి. అవి రాను రాను ఎక్కువయ్యాయి. దీంతో ఇక కలిసి ఉండలేమని..విడాకులు తీసుకుందామని నిర్ణయించుకున్నారు. అలా వివాహం జరిగిన రెండేళ్లకు అంటే 2018లో విడాకుల కోసం కోర్టుకెక్కారు. వారి పాపకు ఏడాది వయస్సు వచ్చింది.

Read more : Bill Gates: బిల్ గేట్స్ దంపతుల సంచలన నిర్ణయం.. 27ఏళ్ల వైవాహిక జీవితంలో విడాకులు

అలా విడాకుల కోసం కోర్టుకెక్కిన సదరు జంట జయపురం కోర్టులో జరిగిన జాతీయ లోక్‌అదాలత్‌లో కేసు విచారణకు వచ్చింది. కేసు వాదించిన న్యాయవాది మున్నాసింగ్ వైవాహిక బంధంలోని గొప్పతనాన్ని వివరించారు. మనస్పర్థల కారణంగా దూరమైన వారిని ఒక్కటి చేసే ప్రయత్నం చేశారు. ఇద్దరినీ ఒప్పంచి అక్కడే వారిద్దరికీ వివాహం జరిపించి విడిపోవాల్సిన జంటను ఒక్కటి చేశారు.