Aamir Khan divorce : విడాకులు తీసుకున్న అమీర్ ఖాన్ – కిరణ్ రావు!

బాలీవుడ్ సీనియర్ నటుడు మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన రెండో భార్య కిరణ్ రావుకు విడాకులు ఇచ్చారు. ఈ విషయాన్ని అధికారికంగా అమీర్ ఖాన్ ప్రకటించారు. దీంతో అమీర్, కిరణ్ రావుల 15 ఏళ్ల వైవాహిక జీవితానికి తెరపడినట్లైంది.

Aamir Khan divorce : విడాకులు తీసుకున్న అమీర్ ఖాన్ – కిరణ్ రావు!

Ameerkhan

Updated On : July 3, 2021 / 1:14 PM IST

Aamir Khan And Kiran Rao : బాలీవుడ్ సీనియర్ నటుడు మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన రెండో భార్య కిరణ్ రావుకు విడాకులు ఇచ్చారు. ఈ విషయాన్ని అధికారికంగా అమీర్ ఖాన్ ప్రకటించారు. దీంతో అమీర్, కిరణ్ రావుల 15 ఏళ్ల వైవాహిక జీవితానికి తెరపడినట్లైంది. ఈ 15 సంవత్సరాల వైవాహిక జీవితంలో అద్భుతమైన అనుభవాలు, సంతోషాన్ని, ఆనందాన్ని తాము పంచుకోవడం జరిగిందని అమీర్, కిరణ్ లు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. తమ బంధం ఒక నమ్మకం, గౌరవం, ప్రేమ అనే పునాదుల మీద బలపడిందని, అయితే..తాము కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

తన బిడ్డకు తల్లిదండ్రులుగా ఉంటూనే…వేర్వేరుగా జీవించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. సినిమాలు, ఇతరత్రా విషయాల్లో పని చేస్తూనే ఉంటామన్నారు. 2005 సంవత్సరంలో కిరణ్ రావును అమీర్ ఖాన్ వివాహం చేసుకున్నారు. 2011లో కుమారుడు జన్మించాడు. గతంలో రీనా దత్తను వివాహం చేసుకున్నారు అమీర్ ఖాన్. ఇరాఖాన్, జునైద్ లు సంతానం. ఇరా సంగీతం అభ్యసిస్తే…జునైద్ తరచూ తండ్రికి చిత్ర నిర్మాణంలో సహయం చేసేవాడు.