Australian Batter Steve Smith: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ స్టీవ్ స్మిత్ సరికొత్త రికార్డు.. వేగంగా 14వేల పరుగులు చేసిన తొలి ఆటగాడు..

సిడ్నీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో స్టీవ్ స్మిత్ 94 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లోనే అంతర్జాతీయ కెరీర్‌లో 14వేల పరుగులు పూర్తి చేశాడు. ఆస్ట్రేలియా నుంచి అత్యంత వేగంగా 14 వేల పరుగులు చేసిన ఆటగాడిగా స్మిత్ నిలిచాడు.

Australian Batter Steve Smith: ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా నుంచి అత్యంత వేగంగా 14 వేల అంతర్జాతీయ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ప్రస్తుతం స్మిత్ వన్డే‌ల్లో అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో ఆస్ట్రేలియా 72 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. అదే సమయంలో, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, వెటరన్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ సరికొత్త రికార్డును సాధించాడు. స్మిత్ ఆస్ట్రేలియా నుండి వేగంగా 14 వేల అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

India vs New Zealand T20 Match: నేడు ఇండియా వర్సెస్ న్యూజీలాండ్ టీ20 మ్యాచ్.. వర్షం ఆడనిస్తుందా?

సిడ్నీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో స్టీవ్ స్మిత్ 94 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లోనే అంతర్జాతీయ కెరీర్‌లో 14వేల పరుగులు పూర్తి చేశాడు. ఆస్ట్రేలియా నుంచి అత్యంత వేగంగా 14 వేల పరుగులు చేసిన ఆటగాడిగా స్మిత్ నిలిచాడు. అదే సమయంలో, ఆస్ట్రేలియా క్రికెట్‌లో డేవిడ్ బూన్‌ను స్మిత్ దాటేశాడు. 14వేల పరుగులు దాటినవారిలో ఆస్ట్రేలియా 9వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియన్ క్రికెట్‌లో టాప్ స్కోరర్‌ల జాబితాలో దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ ముందున్నాడు. అతని తర్వాత స్టీవ్ వా, మైఖేల్ క్లార్క్, అలన్ బోర్డర్, డేవిడ్ వార్నర్ ఉన్నారు.

FIFA World Cup 2022: సాకర్ సంగ్రామం.. నేటి నుంచి ఫుట్‌బాల్ ప్రపంచకప్.. 29రోజులు 64 మ్యాచ్‌లు..

స్మిత్ తన కెరీర్‌ను ఆస్ట్రేలియాకు ఆల్‌రౌండర్‌గా ప్రారంభించాడు. స్మిత్ వన్డే కెరీర్‌లో 4,896 పరుగులు చేశాడు. 5వేల పరుగులకు చేరువలో ఉన్నాడు. టీ20 కెరీర్‌లో స్మిత్ 1008 పరుగులు చేశాడు. ప్రస్తుతం స్మిత్ అద్భుత ఫాంలో ఉన్నాడు. గత నాలుగు వన్డేల్లో మూడు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ సాధించాడు.

ట్రెండింగ్ వార్తలు