FIFA World Cup 2022: సాకర్ సంగ్రామం.. నేటి నుంచి ఫుట్‌బాల్ ప్రపంచకప్.. 29రోజులు 64 మ్యాచ్‌లు..

ఫుట్‌బాట్ మెగా టోర్నీకి 2018లో విజేతగా నిలిచిన ఫ్రాన్స్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతుంది. ఈ మెగా టోర్నీలో 32 జట్లు పోటీ పడుతున్నాయి. 29 రోజులుపాటు 64 మ్యాచ్లు జరుగుతాయి. 32 జట్లు ఎనిమిది గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌లోని మొదటి రెండు జట్లు మాత్రమే నాకౌట్ దశకు చేరుకుంటాయి.

FIFA World Cup 2022: సాకర్ సంగ్రామం.. నేటి నుంచి ఫుట్‌బాల్ ప్రపంచకప్.. 29రోజులు 64 మ్యాచ్‌లు..

FIFA World Cup 2022

FIFA World Cup 2022: మరికొద్ది గంటల్లో ప్రపంచం మొత్తం అబ్బురపడే అత్యద్భుత ఘట్టానికి తెర లేవనుంది. ఎడారి దేశం ఖతార్‌లో మెగా క్రీడా సంబరానికి విజిల్ మోగనుంది. ఖతార్ దేశపు రాజధాని ధోహా వేదికగా 22వ ఫుట్ బాల్ వరల్డ్ కప్ నేటి నుంచి ప్రారంభం కానుంది. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో అతిథ్య ఖతర్‌తో ఈక్వెడార్ తలపడుతుంది. ఖతార్ జాతీయ దినోత్సవం అయిన డిసెంబర్ 18న ఫైనల్ జరుగుతుంది. 2006లో ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఖతర్‌లో మరో మెగా క్రీడా సంబరం ఇదే కావటం విశేషం. ఈ ప్రపంచకప్ నాలుగేళ్లకు ఒకసారి జూన్- జులైలో నిర్వహిస్తారు. అయితే ఆ సమయంలో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఖతర్ లో నిర్వహణ సాధ్యం కాదని ఫిఫా మరో ప్రత్యామ్నాయాన్ని సూచించింది. పలు చర్చల అనంతరం ఫుట్‌బాల్ లీగ్‌ల షెడ్యూల్ లో మార్పులు చేస్తూ నవంబర్- డిసెంబర్ మార్చారు.

FIFA World Cup 2022

FIFA World Cup 2022

ఈ మెగా టోర్నీలో మొదటి రెండు రోజులు మినహా గ్రూప్ దశలో ప్రతీరోజూ నాలుగు మ్యాచ్ లు జరుగుతాయి. నేటి నుంచి డిసెంబర్ 18వరకు జరిగే ఈ మెగా టోర్నీలో డిసెంబర్ 3న రౌండ్ ఆఫ్-16 (ఫ్రీ క్వార్టర్ ఫైనల్స్) ప్రారంభమవుతాయి. ఖతార్ నేడు ప్రారంభ మ్యాచ్ గ్రూప్-ఏలోని ఈక్వెడార్‌తో అతిథ్య ఖతార్ జట్టు తలపడుతుంది. భారత్ కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటల నుంచి ఈ వేడుకలు జరుగుతాయి.

FIFA World Cup 2022

FIFA World Cup 2022

మొత్తం ఎనిమిది వేదికల్లో ఈ మ్యాచ్ లు జరుగుతాయి. వరల్డ్ కప్ ట్రోపీని ఎనిమిది వేదికలను గుర్తు చేయడంతో పాటు ఎప్పటికీ శాశ్వతం అన్నట్లుగా గణిత సంజ్ఞ ఇన్ఫినిటీని కలుపుతూ టోర్నీ లోగోను నిర్వాహకులు తయారు చేశారు. ఈ టోర్నీలో మరో విశేషం ఏమిటంటే.. జట్టు ఒక్కో మ్యాచ్ నుంచి మరో మ్యాచ్ కోసం విమానాల్లో ప్రయాణించే అవసరం లేకుండా వేదికలు దగ్గరలోనే ఉన్నాయి. 1930 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. ఎనిమిది స్టేడియాలు, ప్రాక్టీస్ మైదానాలన్నీ 10 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. ప్రతీ జట్టు తమకు ప్రాక్టీస్ కోసం కేటాయించిన ఒకే బేస్ క్యాంప్‌లోనే టోర్నీ మొత్తం సాధన చేస్తుంది.