Baby Buried Alive: పొలంలో మట్టిలో కనిపించిన చిన్నారి చేయి.. తవ్వి చూస్తే..
ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు.. తన పొలంలో ఒక చిన్నారి చేయి మట్టిలోంచి పైకి తేలుతూ ఉండటాన్ని గమనించాడు. వెంటనే తవ్వి చూసి షాక్ తిన్నాడు. మట్టిలో పాతిపెట్టిన ఆ చిన్నారి ఇంకా ప్రాణాలతోనే ఉంది.
- Narender Thiru
- Published On : August 4, 2022 / 07:39 PM IST
Baby Buried Alive: గుజరాత్‌లో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులెవరో చిన్నారిని బతికుండగానే పొలంలో పాతిపెట్టారు. పొలం యజమాని గుర్తించి చిన్నారిని రక్షించాడు. ఈ ఘటన గుజరాత్, సంబర్కాంత జిల్లా, గంభోయ్ గ్రామంలో జరిగింది. ఇదే గ్రామానికి చెందిన రైతు గురువారం ఉదయం తన పొలానికి వెళ్లాడు.
5G Services In India: అక్టోబర్ నుంచి 5జీ సేవలు.. అందుబాటులోనే ఛార్జీలు: టెలికాం మంత్రి అశ్విని
ఈ క్రమంలో ఒక చోట తన పొలంలో ఎవరో తవ్వినట్లు అనిపించింది. అక్కడికి వెళ్లి పరిశీలిస్తే.. ఒక చిన్నారి చేయి పైకి తేలి కనిపించింది. వెంటనే షాక్ తిన్న రైతు.. పక్కనే పవర్ స్టేషన్‌లో పని చేస్తున్న వాళ్లను పిలిచాడు. వారి సహాయంతో అక్కడ జాగ్రత్తగా తవ్వి చూడగా, ఒక శిశువు కనిపించింది. అయితే, ఆ చిన్నారి ప్రాణాలతోనే ఉంది. వెంటనే విషయాన్ని ఆ రైతు అధికారులకు తెలిపాడు. పొలానికి చేరుకున్న అధికారులు అంబులెన్స్‌లో చిన్నారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Man Caught Brother: పై నుంచి జారిపడ్డ తమ్ముడు.. క్యాచ్ పట్టి రక్షించిన అన్న… వీడియో వైరల్
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. చిన్నారి తల్లిదండ్రుల్ని కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ తర్వాత వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, చిన్నారి విషయంలో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తామని పోలీసులు తెలిపారు.
