Man Caught Brother: పై నుంచి జారిపడ్డ తమ్ముడు.. క్యాచ్ పట్టి రక్షించిన అన్న… వీడియో వైరల్

పై నుంచి జారిపడ్డ తమ్ముడ్ని అన్న జాగ్రత్తగా క్యాచ్ పట్టి రక్షించుకున్నాడు. తమ్ముడికి గాయాలు కాకుండా కాపాడుకోగలిగాడు. ఈ దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో అక్కడ వైరల్‌గా మారింది.

Man Caught Brother: పై నుంచి జారిపడ్డ తమ్ముడు.. క్యాచ్ పట్టి రక్షించిన అన్న… వీడియో వైరల్

Man Caught Brother: ఇంటిపై నుంచి జారిపడ్డ తమ్మున్ని, క్యాచ్ పట్టి రక్షించాడో అన్న. ఈ ఘటన ఇటీవల కేరళలోని మలప్పురంలో జరిగింది. ఒక వ్యక్తి ఇంటి మేడపై శుభ్రం చేస్తున్నాడు. అయితే, అదే సమయంలో అదుపు తప్పి కింద పడిపోబోయాడు. కానీ, కింద ఉన్న అతడి అన్న అది గమనించాడు.

Kerala Man: స్కేట్‌బోర్డుపై కాశ్మీర్ యాత్ర చేస్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

పైనుంచి కచ్చితంగా తమ్ముడి జారిపడతాడని భావించిన అన్న.. అతడ్ని రక్షించుకోవాలనుకున్నాడు. అప్రమత్తంగా ఉండి, కిందికి పడుతున్న తమ్ముడ్ని జాగ్రత్తగా క్యాచ్ పట్టుకున్నాడు. ఈ సమయంలో ఇద్దరూ కింద పడిపోయారు. క్యాచ్ పట్టిన అన్నకు కొంచెం గాయమైనట్లు అనిపించినా, ఇద్దరూ సురక్షితంగానే ఉన్నట్లు అర్థమవుతోంది. కింద పడ్డ తమ్ముడు వెంటనే లేవగా, అన్న కాస్త కుదురుకుని లేచాడు. ఈ సందర్భంలో అన్న అక్కడే ఉండి, తమ్ముడ్ని రక్షించుకోకపోతే అతడికి పెద్ద గాయాలే అయ్యేవి.

Son Body On Shoulders: అంబులెన్స్ ఏర్పాటు చేయని ఆస్పత్రి.. కొడుకు శవాన్ని వర్షంలో భుజాలపైనే మోసిన తండ్రి

ఏదైతేనేం.. ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ దృశ్యం ఆ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో అక్కడ వైరల్‌గా మారింది. కావాలంటే మీరూ… ఓ సారి చూసెయ్యండి.