Kerala Man: స్కేట్‌బోర్డుపై కాశ్మీర్ యాత్ర చేస్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

స్కేట్‌బోర్డుపై కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్ర చేపట్టిన కేరళ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. యాత్ర మరో 15 రోజుల్లో పూర్తవ్వాల్సి ఉండగా, అనాస్ హజాస్ అనే యువకుడు ట్రక్కు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయాడు.

Kerala Man: స్కేట్‌బోర్డుపై కాశ్మీర్ యాత్ర చేస్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Kerala Man: స్కేట్‌బోర్డుపై కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్ర చేపట్టిన కేరళ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కేరళలోని తిరువనంతపురానికి చెందిన అనాస్ హజాస్ అనే యువకుడు హరియాణాలోని పంచకుల వద్ద స్కేట్‌బోర్డింగ్ చేస్తూ, ట్రక్కు ఢీకొనడంతో మృతి చెందాడు. హిమాచల్ ప్రదేశ్‌లోని నలగర్ వెళ్తుండగా, గత మంగళవారం ఈ ఘటన జరిగింది.

Anupama Parameswaran: కార్తికేయ-2 ప్రెస్ మీట్ కోసం ముస్తాబైన అందాల అనుపమ

స్కేట్‌బోర్డింగ్ చేస్తుండగా ట్రక్కు ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు అతడ్ని ఆస్పత్రిలో చేర్చినప్పటికీ, ప్రాణాలు కోల్పోయాడు. అనాస్ హజాస్ గత మే 29న కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు స్కేట్‌బోర్డుపై యాత్ర ప్రారంభించాడు. ఇది దాదాపు 3,700 కిలోమీటర్ల యాత్ర. దీని తర్వాత స్కేట్‌బోర్డుపై ప్రపంచ యాత్ర కూడా చేపట్టాలనుకున్నాడు. త్వరలో భూటాన్, నేపాల్, కంబోడియా కూడా వెళ్లాలనుకున్నాడు. స్కేట్‌బోర్డుపై యాత్ర చేసిన తొలి వ్యక్తిగా నిలవాలనుకున్నాడు. గత మేలో చేపట్టిన యాత్ర మరో 15 రోజుల్లో పూర్తవ్వాల్సింది.

Rahul Gandhi: యంగ్ ఇండియా ఆఫీసుకు సీల్.. భయపడమన్న రాహుల్

ఇంకో 600 కిలోమీటర్లు ప్రయాణిస్తే అతడి యాత్ర పూర్తయ్యేది. అంతలోనే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. యాత్రకు సంబంధించిన విశేషాల్ని అతడు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఉంచేవాడు. రెండు జతల బట్టలతో మాత్రమే యాత్ర చేపట్టాడు. దారిలో తనను ఆహ్వానించే ఎవరో ఒకరి ఇంట్లో బస చేసేవాడు.