Rahul Gandhi: యంగ్ ఇండియా ఆఫీసుకు సీల్.. భయపడమన్న రాహుల్

వాళ్లు నేషనల్ హెరాల్డ్ గురించే మాట్లాడుతున్నారు. కానీ వారి అసలు ఉద్దేశం బెదిరింపులేనని స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. కాస్త ఇబ్బంది పెడితే మేము మౌనమైపోతామని నరేంద్ర మోదీ, అమిత్ షా ఆలోచిస్తున్నారు. కానీ మేం ఎప్పటికీ అలా చేయబోం. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రతిపక్షాలపై నరేంద్ర మోదీ, అమిత్ షా ఎన్ని చేసినా మా మూలాలపై మేము నిలబడతాం

Rahul Gandhi: యంగ్ ఇండియా ఆఫీసుకు సీల్.. భయపడమన్న రాహుల్

Rahul Gandhi: తనతో పాటు విపక్షాల గొంతు నొక్కేందుకు దర్యాప్తు సంస్థల్ని విచ్చలవిడిగా ప్రయోగిస్తూ అధికార దుర్వినయోగం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భయపడే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. నేషనల్ హెరాల్డ్‭తో అనుబంధం ఉన్న ఢిల్లీలోని యంగ్ ఇండియా కార్యాలయాన్ని ఈడీ మూసివేయడంపై కాంగ్రెస్ ఎంపీలు గురువారం సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి రాహుల్ ముఖ్య అతిథిగా హాజరు అవుతారు. అయితే ఈ సమావేశంపై రాహుల్ మీడియా ప్రశ్నించగా.. విపక్షాల్ని అణచివేసేందుకే దర్యాప్తు సంస్థల్ని ఉపయోగించుకుంటున్నారని మోదీ ప్రభుత్వంపై మండి పడ్డారు.

‘‘వాళ్లు నేషనల్ హెరాల్డ్ గురించే మాట్లాడుతున్నారు. కానీ వారి అసలు ఉద్దేశం బెదిరింపులేనని స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. కాస్త ఇబ్బంది పెడితే మేము మౌనమైపోతామని నరేంద్ర మోదీ, అమిత్ షా ఆలోచిస్తున్నారు. కానీ మేం ఎప్పటికీ అలా చేయబోం. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రతిపక్షాలపై నరేంద్ర మోదీ, అమిత్ షా ఎన్ని చేసినా మా మూలాలపై మేము నిలబడతాం’’ అని రాహుల్ గాంధీ అన్నారు. అయితే ‘పరిగెత్తేందుకు కూడా మీకు స్థలం లేదని అంటున్నారు’’ అంటూ మీడియా రాహుల్‭ను ప్రశ్నించింది. దీనికి రాహుల్ సమాధానం ఇస్తూ ‘‘పరిగెత్తడం గురించి ఎవరు మాట్లాడుతున్నారు? నిజానికి ఇలా అనే వారే పరిగెత్తుతున్నారు. బెదిరింపులకు మేం భయపడం. నరేంద్ర మోదీకి అసలే భయపడం. వారు ఏం చేస్తారో చేసుకోనివ్వండి. మా పని మేం చేసుకుంటూ పోతాం. మా పని ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే’’ అని అన్నారు.

ఢిల్లీలోని హెరాల్డ్‌ హౌజ్‌ ప్రాంగణంలో ఉన్న ‘యంగ్‌ ఇండియన్‌’ కార్యాలయానికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ బుధవారం తాత్కాలికంగా సీల్‌ వేసింది. నేషనల్‌ హెరాల్డ్‌ మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా.. ఈడీ మంగళవారం బహదూర్‌ షా జాఫర్‌ మార్గ్‌లోని హెరాల్డ్‌ హౌజ్‌ సహా దాదాపు 12 చోట్ల తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సోదాల సమయంలో అక్కడ ఉండాల్సిన యంగ్‌ ఇండియన్‌ కార్యాలయ ప్రతినిధులు హాజరు కాలేదు. నిబంధనల ప్రకారం.. వారు లేకుండా సాక్ష్యాలను సేకరించకూడదు. దీంతో సాక్ష్యాలను పరిరక్షించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈడీ వర్గాలు తెలిపాయి.

Manoj Tiwari: హెల్మెట్ లేకుండా బైక్ నడిపిన బీజేపీ ఎంపీకి ఫైన్.. అనంతరం క్షమాపణ