Balayya
Balakrishna : ‘మా’ ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో రోజు రోజుకి ప్రచారం హీట్ ఎక్కుతుంది. రెండు ప్యానెల్స్ ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ రోజూ ప్రెస్ మీట్స్ పెడుతుంటే మంచు విష్ణు ప్యానెల్ రోజుకొక సెలబ్రిటీని కలుస్తూ ఓటు వేయమని అడుగుతూ మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు. ఇప్పటికే కృష్ణ గారిని కలిసి ఆయన ఫ్యామిలీ నటులు, ఆయనకి దగ్గరి ఆర్టిస్టుల తరుపు వాళ్ళందరి ఓట్లు తనకే వేయమని అభ్యర్థించారు. తాజాగా నటసింహం బాలకృష్ణని కలిసాడు మంచు విష్ణు.
Sharukh khan : డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కొడుకు??
బాలకృష్ణని కలిసి ‘మా’ ఎన్నికల్లో అండగా నిలబడాలని కోరారు. బాలయ్య బాబుతో దిగిన ఫోటో ట్విట్టర్ లో షేర్ చేసి “ఒక్కగానొక్క నట సింహానికి థ్యాంక్స్. మద్దతుగా నిలిచి, ఆశీర్వదించినందుకు బాలా అన్నకు ధన్యవాదాలు. నా వెనక బాలా అన్న ఉండడం గౌరవంగా భావిస్తున్నా” అంటూ.. విష్ణు ట్వీట్ చేశారు. ఈ నెల 10న ‘మా’ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ ని తలపిస్తున్నాయి. ‘మా’ ఎన్నికల్లో గెలుపు ఇరు ప్యానళ్లు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో వ్యూహంతో ముందుకి వెళ్తున్నారు. మంచు విష్ణు ఇలా ఇండస్ట్రీ పెద్దలందర్నీ కలుస్తూ మద్దతు కూడగడుతున్నారు. హోరా హోరీగా జరగనున్న ‘మా’ ఎలక్షన్స్ లో విజయం ఎవర్ని వరించనుందో చూడాలి.