Sharukh khan : డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కొడుకు అరెస్ట్

ఇప్పటికే బాలీవుడ్ లో చాలా సార్లు డ్రగ్స్ కేసు నడిచింది. తాజాగా మరోసారి బాలీవుడ్ లో డ్రగ్స్ విషయం కలకలం రేపుతోంది. అయితే ఈ సారి బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు డ్రగ్స్

Sharukh khan :  డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కొడుకు అరెస్ట్

Sharukh

Sharukh Khan :  ఇండియన్ సినీ పరిశ్రమలో బాలీవుడ్ ది భారీ మార్కెట్. కానీ గత కొద్ది కాలంగా ఇండస్ట్రీ అతలాకుతలం అవుతుంది. ఒక పక్క కరోనా, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య, ప్రముఖుల మరణాలు, మరో పక్క డ్రగ్స్ కేసు వీటన్నిటితో బాలీవుడ్ బెంబేలెత్తిపోతోంది. ఇప్పటికే బాలీవుడ్ లో చాలా సార్లు డ్రగ్స్ కేసు నడిచింది. తాజాగా మరోసారి బాలీవుడ్ లో డ్రగ్స్ విషయం కలకలం రేపుతోంది. అయితే ఈ సారి బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు డ్రగ్స్ దాడుల్లో దొరకడంతో ఈ విషయం సంచలనంగా మారింది.

నిన్న ముంబై తీరంలో క్రూయిజ్ షిప్ లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై ఎన్ సి బి(నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) ఆకస్మిక దాడి జరిపింది. ఈ పార్టీలో ఓ బృందం దగ్గర భారీ ఎత్తున మాదకద్రవ్యాలు చిక్కినట్టుగా తెలుస్తుంది. దీంతో ఆ పార్టీలో కొంతమందిని ఎన్సీబీ అదుపులోకి తీసుకుంది. అయితే అదుపులోకి తీసుకున్న వారిలో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నట్టు సమాచారం. ఆర్యన్ ఖాన్ ని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Rashmika Mandanna : అండర్వేర్ యాడ్ లో రష్మిక.. ఈ యాడ్ ఎలా చేశావంటూ భారీ ట్రోలింగ్

అయితే ఇవాళ ఉదయం ఆర్యన్ ఖాన్ పై ప్రస్తుతానికి ఎలాంటి ఆరోపణలు లేవని ఇంకా ఆయనను అరెస్ట్ చేయలేదని, కేవలం విచారణ మాత్రమే చేస్తున్నామని ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తెలిపారు. విచారణ తర్వాత ఆర్య‌న్‌తోపాటు అత‌ని స్నేహితుడు అర్బాజ్‌, మున్మున్ ధ‌మేచాల‌ను ఆరోగ్య ప‌రీక్ష‌ల కోసం తీసుకెళ్లారు. ఈ పరీక్షల్లో ఆర్యన్ డ్రగ్స్ వాడాడు అని తేలడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్యన్ తో పాటు అతని స్నేహితులని కూడా అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ తో బాలీవుడ్ లో కలకలం రేగుతుంది. నెటిజన్లు ఆర్యన్ ని షారుఖ్ ఖాన్ ని ట్రోల్ చేస్తున్నారు.