Bandi Sanjay: సీఎం కేసీఆర్ డైరెక్షన్ లో పోలీసుల సమక్షంలోనే మాపై దాడులు: బండి సంజయ్

బీజేపీ పేరు వింటేనే కేసీఆర్ కు, కేటీఆర్ కు భయం పట్టుకుందని.. అందుకే దాడుల పేరుతో బీజేపీని అడ్డుకుని రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించాలనుకుంటున్నాడని బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు.

Bandi Sanjay: బీజేపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులన్నీ సీఎం కేసీఆర్ డైరెక్షన్ లో పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నయని.. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో ఎంపీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను శనివారం ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కరీంనగర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రజల అభివృద్ధి, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ పనిచేస్తుందని.. ప్రజా సమస్యలను దారి మళ్లించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమేనన్న బండి సంజయ్.. ప్రజా సమస్యల పరిష్కారంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.

Also read: AP PRC Issue: ఏపీలో కొనసాగుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల రిలే నిరాహార దీక్షలు

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే బీజేపీ నేతలపై దాడులు చేయిస్తున్నారుని, అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నల్గొండ, కరీంనగర్ లో తనపైనా, ఆర్మూర్ లో ఎంపీ అరవింద్ పై జరిగిన దాడులు సీఎం కుట్రలో భాగమే అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో నాగేశ్వర్ రావు అనే బీజేపీ కార్యకర్తను పోలీసులు విచక్షణా రహితంగా కొట్టి.. హత్య చేసేందుకు కుట్ర చేశారని.. స్థానిక సీఐ బూతులు తిడుతూ బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించాడని బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో కొందరు పోలీసు అధికారులు సీఎంకు కొమ్ముకాస్తున్నరని ఆరోపించిన బండి సంజయ్.. ఇది మంచి పద్దతి కాదని హెచ్చరించారు.

Also read: Train Tracks Flames: అమెరికాలో రైలు పట్టాలపై చలిమంటలు, ఎందుకో తెలుసా?

బీజేపీ పేరు వింటేనే కేసీఆర్ కు, కేటీఆర్ కు భయం పట్టుకుందని.. అందుకే దాడుల పేరుతో బీజేపీని అడ్డుకుని రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించాలనుకుంటున్నాడని బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అరాచకాలు, అక్రమాలు చేసి కోట్లు సంపాదించి ఆ సొమ్ముతో ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేయాలనీ చూస్తున్నదంటూ బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో పనిచేస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం తీవ్రంగా కృషిచేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

Also read: AP Employees Strike : ఏపీలో పీఆర్సీ వార్‌.. ఉద్యోగుల సమ్మెకు పెరుగుతున్న మద్దతు

ట్రెండింగ్ వార్తలు