AP PRC Issue: ఏపీలో కొనసాగుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల రిలే నిరాహార దీక్షలు

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పీఆర్సీ రగడ రోజురోజుకి ఉదృతం అవుతుంది. అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఉమ్మడిగా పీఆర్సీ కోసం పోరాడుతున్నారు.

AP PRC Issue: ఏపీలో కొనసాగుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల రిలే నిరాహార దీక్షలు

Prc Issue

AP PRC Issue: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పీఆర్సీ రగడ రోజురోజుకి ఉదృతం అవుతుంది. అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఉమ్మడిగా పీఆర్సీ కోసం పోరాడుతున్నారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. శనివారం ఏపీ ఎన్జీవో రాష్ట్ర నాయకులు బండి శ్రీనివాసులు రిలే నిరాహార దీక్షలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భంగా బండి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ లపై సానుకూల వైఖరి తెలిపితేనే చర్చలకు వస్తామని, లేని పక్షంలో సమ్మెకు వెళ్లడం ఖాయమని అన్నారు. కొత్త పిఆర్సి వల్ల ఉద్యోగులు నష్టపోతున్నారన్న శ్రీనివాసులు పాత జీతాలే ఇవ్వాలని డిమాండ్ ప్రభుత్వాన్ని డీమాండ్ చేశారు. పీఆర్సీపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ.. కావాలనే తమపై విరుద్ధ వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని శ్రీనివాసులు అన్నారు.

Also read: Train Tracks Flames: అమెరికాలో రైలు పట్టాలపై చలిమంటలు, ఎందుకో తెలుసా?

ఇక విజయవాడ దర్నాచౌక్ లోనూ గత మూడు రోజులుగా రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. పీఆర్సీ జీఓలను వ్యతిరేకిస్తూ పిడిఎఫ్ ఎమ్యెల్సీ లక్ష్మణరావు శనివారం దర్నాచౌక్ లో రిలే నిరాహారదీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులపై బెదిరింపులకు పాల్పడుతోందని విమర్శించారు. ఉద్యోగులపై ఎస్మా చట్టం ప్రయోగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని ఆరోపించిన లక్ష్మణరావు.. ఎస్మా చట్టం ఉపయోగించిన ప్రతి ప్రభుత్వం బ్రష్టుపట్టిపోయిందని వ్యాఖ్యానించారు. ఉద్యోగుల ఉద్యమాన్ని ప్రభుత్వం కించ పరిచే విధంగా వ్యవహరిస్తోందని.. ఉద్యోగుల ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని లక్ష్మణరావు అన్నారు. అధికారులపై, ప్రధాన కార్యదర్శులపై, సలహాదారులపై ముఖ్యమంత్రి జగన్ ఆధారపడకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు.

Also Read: Mahesh Bank Hacking: మహేష్ బ్యాంకు హ్యాకింగ్‌ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు