Bandla Ganesh
Bandla Ganesh : ప్రముఖ తెలుగు సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ మరో సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారు. బండ్ల గణేశ్ ఏది చేసినా.. ఏం మాట్లాడినా… అది చాలాసార్లు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంటుంది. తాజాగా… మా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ట్విట్టర్ లో స్పందించారు బండ్ల గణేశ్. అధ్యక్షుడిగా బరిలోకి దిగుతూ ఇటీవలే ప్యానెల్ ప్రకటించిన ప్రకాశ్ రాజ్ కు షాక్ ఇస్తూ ట్వీట్ చేశారు.
“ప్రకాశ్ రాజ్ గారూ.. మీ ప్యానెల్ లో స్పోక్స్ పర్సన్ గా అవకాశం ఇచ్చినందుకు మీకు థాంక్స్. కానీ.. నా వ్యక్తిగత పనుల వల్ల దీనికి నేను న్యాయం చేయలేనేమోననిపిస్తోంది. దయచేసి ఈ పోస్టుకు వేరేవాళ్లను సెలెక్ట్ చేసుకోండి. మీ టీమ్ కు ఆల్ ద బెస్ట్” అని ట్వీట్ చేశారు బండ్ల గణేశ్.
జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తా
అంతేకాదు.. తన అజెండా ఏంటో వివరిస్తూ.. వరుసగా ట్వీట్లు చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ పదవికి తాను పోటీ చేయాలనుకుంటున్నట్టు ప్రకటించారు. “మాట తప్పను… మడమ తిప్పను. నాది ఒకటే మాట -ఒకటే బాట. నమ్మినవారి కోసం బతుకుతా. నా మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకుంటాను. నేను ఎవరిమాట వినను త్వరలో జరిగే మా ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీ గా పోటీ చేస్తాను. పోటీ చేసి ఘన విజయం సాధిస్తాను” అన్నారు బండ్ల గణేశ్.
Prakash Raj-MAA : ప్రకాశ్ రాజ్ ‘మా’ ప్యానెల్ ఇదే.. తప్పుకున్న సీనియర్లు
జనరల్ సెక్రెటరీ పదవికి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు బండ్ల గణేష్. ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో జనరల్ సెక్రెటరీ పదవికి పోటీ లో నిలుచున్న జీవిత రాజశేఖర్ ని ఆయన వ్యతిరేకిస్తున్నారు.
తాను అభిమానించిన వాళ్ళను తిట్టిన జీవితకు సపోర్ట్ చేయలేనని చెప్పారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో జనరల్ సెక్రెటరీ పదవి తప్ప అందరూ గెలవాలని బండ్ల గణేశ్ కోరుకుంటున్నారు. జనరల్ సెక్రెటరీ పదవికి తాను పోటీ చేసి గెలుస్తానని అన్నారు. ఐతే.. ప్రకాష్ రాజ్‌కి తనకు విభేదాలు లేవన్నారు బండ్ల గణేశ్.
“మనస్సాక్షికి ఎంతచెప్పినా మాట వినడం లేదు. నన్ను పోటీ చెయ్ అంటోంది. ఒకేఒక అవకాశం నాకివ్వండి నేనేంటో చూపిస్తా. నా పరిపాలన ఎంటో తెలియచేస్తా. వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడం నా ధ్యేయం. దానికోసం పోరాడతా. వారి సొంత ఇంటి కల నిజం చేస్తా. ఇప్పుడు పదవుల్లో ఉన్నవాళ్లు రెండేళ్లుగా ఏమీ చేయలేదు. ఇప్పుడు చేస్తామంటే ‘మా’ సభ్యులు నమ్మరు. గొడవలతో ‘మా’ సభ్యులను మోసం చేసింది చాలు. ఇక అలా జరగొద్దు. అందరి ఆశీస్సులు కావాలి. ‘మా’ను బలోపేతం చేద్దాం.. ముఖ్యంగా పేద కళాకారులకు ఇళ్ల కల నిజం చేద్దాం. అదే మా నిజమైన అభివృద్ధికి చిహ్నం” అని బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. బండ్ల గణేశ్ చేసిన ట్వీట్లు… పోటీలో నిలవడం.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
Prakash Raj : ‘మా’లో కాక రేపుతున్న ప్రకాశ్‌రాజ్ ట్వీట్
మాట తప్పను … మడమ తిప్పను
నాది ఒకటే మాట -ఒకటే బాట
నమ్మడం -నమ్మినవారికోసం బతకడంనా మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకుంటాను –
నేను ఎవరిమాట విననుత్వరలో జరిగే మా ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీ గా పోటీ చేస్తాను –
పోటీ చేసి ఘన విజయం సాధిస్తాను…….— BANDLA GANESH. (@ganeshbandla) September 5, 2021
Respected @prakashraaj Garu,
Thanks for choosing me as a Spokesperson, but I am unable to do stisfy and lawful for this this post because of my personal works, kindly choose another person for this post.
All the best for your team
Regards.
Bandla Ganesh.— BANDLA GANESH. (@ganeshbandla) September 5, 2021