BCCI Announces Women’s Squad : బంగ్లాదేశ్ సిరీస్‌కు భారత మహిళల జట్టు… బీసీసీఐ ప్రకటన

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లే భారత మహిళల వన్డే, టీ20 జట్టును ప్రకటించింది. బంగ్లాదేశ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ 20, ఓడీఐ సిరీస్‌లకు మహిళల సెలక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది.....

BCCI Announces India Womens Squad

Indian Women’s ODI and T20I squad : భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లే భారత మహిళల వన్డే, టీ20 జట్టును ప్రకటించింది. బంగ్లాదేశ్‌తో (Bangladesh Series) జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ 20, ఓడీఐ సిరీస్‌లకు మహిళల సెలక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. (BCCI Announces) మొత్తం ఆరు మ్యాచ్‌లు మీర్పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. హర్మన్‌ప్రీత్ కౌర్ రెండు ఫార్మాట్‌లలో జట్టుకు నాయకత్వం వహిస్తుండగా, స్మృతి మంధాన రెండు ఫార్మాట్‌లలో ఆమెకు డిప్యూటీ కెప్టెన్ గా వ్యవహరించనుంది.

Prithvi Shaw : టీమ్ఇండియాలో చోటు ద‌క్క‌క‌పోవ‌డంతో.. పృథ్వీ షా కీల‌క నిర్ణ‌యం..!

సీనియర్ పేసర్ శిఖా పాండే, పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్, బ్యాటర్ రిచా ఘోష్‌లు జట్టులో చోటు దక్కించుకోలేక పోయారు. ఈ పర్యటన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచ్ జులై 9 వతేదీన జరగనుంది. రెండవ, మూడవ మ్యాచ్‌లు వరుసగా జులై 11, జులై 13 తేదీల్లో జరుగుతాయని బీసీసీఐ వివరించింది. రెండు రోజుల విరామం తర్వాత మూడు వన్డేల సిరీస్ జులై 16వ తేదీన ప్రారంభం కానుంది.రెండో, మూడో వన్డేలు వరుసగా జులై 19, జులై 22తేదీల్లో జరుగుతాయి.

ICC World Cup 2023 : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు అర్హ‌త సాధించిన శ్రీలంక‌.. మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే

భారత టీ20 జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్, దేవికా వైద్య, ఉమా చెత్రీ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, ఎస్ మేఘనా, మేఘన పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, అంజలి సర్వాణి, మోనికా పటేల్, రాశి కనోజియా, అనూషా బారెడ్డి, మిన్ను మణి.

Ileana : ప్రియుడి ఫోటోని పోస్ట్ చేసిన ఇలియానా.. బిడ్డ పుట్టాక అయినా చూపిస్తావా అంటూ..
భారత వన్డే జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్ ), దీప్తి శర్మ, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్, దేవికా వైద్య, ఉమా చెత్రీ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, ప్రియా పునియా, పూజ వస్త్రాకర్, మేఘనా సింగ్, అంజలి సర్వాణి, మోనికా పటేల్, రాశి కనోజియా, అనూషా బారెడ్డి, స్నేహ రాణా.