ICC World Cup 2023 : వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించిన శ్రీలంక.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే
ర్యాంకింగ్స్ ద్వారా అర్హత సాధించలేకపోయిన శ్రీలంక (Sri Lanka) జట్టు తాజాగా జింబాబ్వే(Zimbabwe )ను ఓడించడం ద్వారా వన్డే ప్రపంచకప్‌కు క్వాలిఫై అయ్యింది.

SriLanka qualified for World Cup
ICC World Cup 2023- Sri Lanka : భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే వన్డే ప్రపంచకప్ 2023 జరగనుంది. మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. వన్డేల్లో ర్యాంకింగ్స్ ఆధారంగా ఇప్పటికే ఎనిమిది జట్లు నేరుగా అర్హత సాధించాయి. మరో రెండు జట్లు క్వాలిఫయర్స్ టోర్నీ ద్వారా రానున్నాయి. ర్యాంకింగ్స్ ద్వారా అర్హత సాధించలేకపోయిన శ్రీలంక (Sri Lanka) జట్టు తాజాగా జింబాబ్వే(Zimbabwe )ను ఓడించడం ద్వారా వన్డే ప్రపంచకప్‌కు క్వాలిఫై అయ్యింది.
క్వాలిఫయర్ టోర్నీలో ఆదివారం జింబాబ్వేతో జరిగిన సూపర్-6 మ్యాచ్‌లో గెలుపొందడం ద్వారా శ్రీలంక ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లొ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 32.2 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. సీన్ విలియమ్సన్ (56; 57 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో అలరించగా సికిందర్ రజా(31; 51 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. మిగిలిన వారు విఫలం కావడంతో జింబాబ్వే తక్కువ స్కోరుకే పరిమితమైంది. లంక బౌలర్లో మహేశ్ తీక్షణ నాలుగు, మధుషంక మూడు వికెట్లు పడగొట్టగా, మతిరణ రెండు వికెట్లు, కెప్టెన్ ధసున్ శనక ఓ వికెట్ తీశాడు.
Prithvi Shaw : టీమ్ఇండియాలో చోటు దక్కకపోవడంతో.. పృథ్వీ షా కీలక నిర్ణయం
Sri Lanka are #CWC23 bound ??? pic.twitter.com/DfV6N7TSKY
— ICC (@ICC) July 2, 2023
ఓపెనర్ నిస్సంక (101 నాటౌట్; 102 బంతుల్లో ; 14 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేడంతో స్వల్ప లక్ష్యాన్ని శ్రీలంక కేవలం 33.1 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయిన ఛేదించింది. అతడితో పాటు దిముత్ కరుణరత్నే (30), కుశాల్ మెండీస్ (25 నాటౌట్) లు రాణించారు. ఈ విజయంతో 8 పాయింట్లు లంక ఖాతాలో చేరాయి. దీంతో సూపర్-6 దశలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే లంక ఫైనల్‌కు అర్హత సాధించింది. ఫైనల్‌కు చేరిన జట్లు వన్డే ప్రపంచకప్ 2023కి క్వాలిఫై అవుతాయన్న సంగతి తెలిసిందే.
స్వదేశంలో జరుగుతున్న క్వాలిఫయర్ టోర్నీలో జింబాబ్వే జట్టుకు ఇదే తొలి ఓటమి. ప్రపంచకప్‌కు అర్హత సాధించడానికి జింబాబ్వేకు అవకాశాలు ఉన్నాయి. ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధిస్తే నేరుగా ఎలాంటి సమీకరణాలు లేకుండా జింబాబ్వే అర్హత సాధిస్తుంది. ఓడిపోతే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిందే. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్ జట్టు ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయిన సంగతి తెలిసిందే.