Commonwealth Games: చరిత్ర సృష్టించిన భవినా పటేల్.. పారా టేబుల్ టెన్నిస్ విభాగంలో ఇండియాకు తొలి స్వర్ణం

బర్మింగ్ హోమ్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. తాజాగా భారత పారా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవినాబెన్ పటేల్ (Bhavinaben Patel) ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించింది.

Commonwealth Games: బర్మింగ్ హోమ్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. తాజాగా భారత పారా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవినాబెన్ పటేల్ (Bhavinaben Patel) ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో 3-5తో స్వర్ణం సాధించింది. దీంతో ఈ పోటీల్లో ఇప్పటి వరకు భారత్ పతకాల సంఖ్య 40కి చేరింది. వీటిలో 13 స్వర్ణాలు, 11 రజతాలు, 16 కాంస్యాలు ఉన్నాయి.

Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో సరికొత్త రికార్డు.. స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న 75ఏళ్ల వృద్ధుడు

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత స్టార్ పారా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవినాబెన్ పటేల్ చరిత్ర సృష్టించింది. ఈ విభాగంలో మహిళల సింగిల్స్ లో 3-5 తేడాతో విజయం సాధించి.. స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. గుజరాత్‌కు చెందిన 35 ఏళ్ల భవినా పటేల్ 12-10 11-2 11-9తో నైజీరియాకు చెందిన క్రిస్టియానా ఇక్‌పెయోయ్‌పై 3-0తో విజయం సాధించింది. దీంతో టెబుల్ టెన్నిస్ విభాగంలో భారత తరఫున స్వర్ణ పతకం సాధించిన మొదటి క్రీడాకారిణిగా భవినాబెన్ పటేల్ రికార్డులకెక్కింది. అంతకముందు మరో పారా టేబుల్ టెన్నిస్ పోటీలో ప్లేయర్‌ సోనాల్‌బెన్‌ మనూబాయి పటేల్‌ కాంస్యం సొంతం చేసుకుంది.

Commonwealth Games 2022 : పసిడి పట్టు.. కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత రెజ్లర్ల జోరు.. ఒకేరోజు 3 స్వర్ణాలు

భవినాబెన్ పటేల్ 2011 పారా టేబుల్ టెన్నిస్ లో థాయ్‌లాండ్ ఓపెన్‌లో వ్యక్తిగత విభాగంలో రజత పతకాన్ని గెలుచుకోవడం ద్వారా ప్రపంచ నంబర్ 2 ర్యాంకింగ్‌కు చేరుకుంది. అంతేకాక 2013లో బీజింగ్‌లో జరిగిన ఆసియా పారా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్ క్లాస్ 4లో రజత పతకాన్ని కూడా గెలుచుకుంది. 2017లో బీజింగ్‌లో జరిగిన ఆసియా పారా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో భావినా పటేల్ కాంస్యం సాధించింది. తాజాగా కామన్వెల్త్ గేమ్స్ -2022లో భువినాబెన్ పటేల్ అద్భుత ప్రదర్శన కనబర్చి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.

భవినా పటేల్ స్వర్ణం పతకం సాధించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పారా టేబుల్ టెన్నిస్ లో ప్రతిష్టాత్మకమైన బంగారు పతకాన్ని భువినా గెలుచుకోవటం సంతోషంగా ఉందని అన్నారు. ఆమె సాధించిన విజయాలు టేబుల్ టెన్నిస్ లో పాల్గొనేలా భారత యువతను ప్రేరేపిస్తాయని ఆశిస్తున్నానని ప్రధాని అన్నారు. భవినా రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు