Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో సరికొత్త రికార్డు.. స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న 75ఏళ్ల వృద్ధుడు

కామన్వెల్త్ క్రీడల్లో ఎనిమిదో రోజు సరికొత్త రికార్డు నమోదైంది. స్కాట్లాండ్ కు చెందిన 75ఏళ్ల జార్జ్ మిల్లర్ సరికొత్త రికార్డును నమోదు చేశాడు.

Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో సరికొత్త రికార్డు.. స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న 75ఏళ్ల వృద్ధుడు

Commonwealth Games

Commonwealth Games 2022: కామన్వెల్త్ క్రీడల్లో ఎనిమిదో రోజు సరికొత్త రికార్డు నమోదైంది. స్కాట్లాండ్ కు చెందిన 75ఏళ్ల జార్జ్ మిల్లర్ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. లాన్ బౌల్స్ మిక్స్‌డ్ పెయిర్ ఫైనల్ లో మెలనీ ఇన్నెస్‌తో కలిసి కలిసి విజేతగా నిలిచాడు. దీంతో అతి పెద్ద వయస్సులో స్వర్ణ పతకం అందుకున్న వ్యక్తిగా రికార్డును నమోదు చేశాడు.

విక్టోరియా పార్క్‌లో జరిగిన పారా మిక్స్‌డ్ పెయిర్స్ B2/B3లో మెలానీ ఇన్నెస్, జార్జ్ మిల్లర్, రాబర్ట్ బార్, సారా జేన్ ఎవింగ్ జట్టు 16-9 తేడాతో వేల్స్ ను ఓడించి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. అయితే ఈవెంట్ లో స్కాట్లాండ్ జట్టు గెలుపొందడం కూడా ఇదే తొలిసారి. కామన్వెల్త్ గేమ్స్ లో 75ఏళ్ల వయస్సులో పసిడి పతకం సాధించడం ఇదే తొలిసారి.

George Miller

బుధవారం స్కాట్లాండ్కు చెందిన 72 ఏళ్ల రోజ్మేరీ లెంటస్ పారా లాన్ బౌల్స్ మహిళల విభాగంలో పసిడి నెగ్గి కామన్వెల్త్ చరిత్రలో గోల్డ్ మెడల్ గెలిచిన అతి పెద్ద వయస్సు గల వ్యక్తిగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు అదే దేశానికి చెందిన జార్జ్ మిల్లర్ ఆమె రికార్డును బద్దలు కొట్టి సరికొత్త రికార్డును సృష్టించాడు.