Sidharth Shukla : బిగ్ బాస్ 13 విన్నర్ మృతి
ఝలక్ దిక్లాజా 6, ఫియర్ ఫ్యాక్టర్- ఖత్రోంకీ ఖిలాడీ 7 తో పాపులారిటీ పెంచుకున్నారు. బిగ్ బాస్ 13 రియాలిటీ షోలో విన్నర్ గా నిలవడంతో... సిద్ధార్థ్ కెరీర్ కు మరింత ఊపు వచ్చింది.

Sidharth Shukla
Sidharth Shukla- BiggBoss 13 : బిగ్ బాస్ 13 హిందీ విన్నర్ సిద్ధార్థ్ శుక్లా సెప్టెంబర్ 2న ఉదయం హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు. ఈ విషయం… హిందీ టీవీ, సినిమా సహా.. ఎంటర్ టైన్ మెంట్ ఫీల్డ్ లో హాట్ టాపిక్ అయింది. గత రాత్రి పడుకునేముందు… కొన్ని మెడిసిన్ తీసుకున్నారని… దీంతో… మర్నాడు లేవలేకపోయారని… డాక్టర్లు చెప్పారు. మృతికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉందన్నారు డాక్టర్లు.
Read This : Bigg Boss 5 : అవన్నీ రూమర్స్.. వచ్చేస్తున్నాడు ‘బిగ్ బాస్’..
సిద్ధార్థ్ శుక్లా వయసు 40 ఏళ్లు. ముంబైలోని తన ఫ్లాట్ లో అచేతనంగా పడి ఉన్న సిద్ధార్థ్ శుక్లాను.. సెప్టెంబర్ 2.. ఉదయం కూపర్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. హాస్పిటల్ కు రావడానికి ముందే.. సిద్ధార్థ్ శుక్లా చనిపోయాడని డాక్టర్లు కన్ ఫామ్ చేశారు. పోస్ట్ మార్టమ్ చేసి.. బాడీని కుటుంబసభ్యులకు అప్పగిస్తామన్నారు డాక్టర్లు.
సిద్ధార్థ్ శుక్లాకు తల్లి, ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. మోడలింగ్ తో ఎంటర్ టైన్మెంట్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టిన సిద్ధార్థ్… టెలివిజన్ షో ‘బాబుల్ కా అంగన్ చూటీ నా’లో లీడ్ రోల్ పోషించాడు. జానే పెహ్చానా సే, యే అజ్నబీ, లవ్ యు జిందగీ, బాలికా వధు లాంటి షోలతో… చాలామంది అభిమానం సంపాదించుకున్నాడు. ఝలక్ దిక్లాజా 6, ఫియర్ ఫ్యాక్టర్- ఖత్రోంకీ ఖిలాడీ 7 తో పాపులారిటీ పెంచుకున్నాడు. బిగ్ బాస్ 13 రియాలిటీ షోలో విన్నర్ గా నిలవడంతో… సిద్ధార్థ్ కెరీర్ కు మరింత ఊపు వచ్చింది.
Read This : సుశాంత్‌ది హత్య అనేందుకు CBIకి ఆధారాలు దొరకలేదు
2014లో బాలీవుడ్ మూవీలో తొలిసారి నటించాడు సిద్ధార్థ్ శుక్లా. కరణ్ జోహార్ నిర్మించిన హంప్టీ కి దుల్హానియాలో సపోర్టింగ్ రోల్ చేశాడు. కెరీర్ మంచి స్వింగ్ లో ఉన్న టైంలో… సిద్ధార్థ్ శుక్లా చనిపోవడం… బాలీవుడ్ లో మరోసారి హాట్ టాపిక్ అయింది. ఆయన మరణానికి కారణమేంటో అంటూ బాలీవుడ్ చర్చించుకుంటోంది.