Birth To Baby With Four Hands And Four Legs
birth to baby with four hands and four legs : బీహార్‌లోని కటిహార్ జిల్లాలో ఓ శిశువు నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో జన్మించింది.ఆ బిడ్డను చూసి ప్రసవం చేసిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు.ఈ వింత శిశువును చూడటానికి పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఆస్పత్రికి వచ్చి మరీ శిశువును చూస్తున్నారు. ఫోటోలు తీసుకుంటున్నారు. కానీ మరో పక్కతల్లి మాత్రం తన బిడ్డను చూసి తల్లడిల్లిపోతోంది. ఇటువంటి బిడ్డను ఎలా పెంచాలి? పెరుగుతున్న బిడ్డ పరిస్థితి ఏంటోనని ఆందోళన చెందుతోంది.
Also read : Strange Baby : ఆదోనిలో వింత శిశువు జననం
కటిహార్ జిల్లాలోని సదర్ ఆసుపత్రిలో శిశువుకు నాలుగు కాళ్లు, నాలుగు చేతులు జన్మించింది. అసాధారణంగా జన్మించిన శిశువులు ప్రాణాలతో ఉండరు.కానీ ఈ బిడ్డ మాత్రం చక్కగా ఆరోగ్యంగా ఉందంటున్నారు డాక్టర్లు. అటువంటి బిడ్డను చూసి ఆ తల్లి మాత్రం తల్లడిల్లిపోతోంది. ఆమెకు కవల పిల్లలు పుట్టాల్సి ఉండగా..గర్భస్థ పిండం ఎదుగుదల సరిగా లేకపోవడం వల్లే ఇలా బిడ్డ నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో పుట్టిందని డాక్టర్లు చెబుతున్నారు.
Also Read : ఒంటి కన్నుతో పిల్ల షార్క్….రాబోవు విపత్తులకు సంకేతామా?
కానీ బాలింత బంధువులు మాత్రం ఇది డాక్టర్ల నిర్లక్షమేనని..ప్రతి నెలా చెకప్ చేసిన డాక్టర్లు గర్భంలో బిడ్డ్ పరిస్థితి ఎలా ఉందో అనే విషయంలో నిర్లక్ష్యం వహించారని అందుకే కవల పిల్లలు ఒకేబిడ్డలా కలిసిపోయి నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో పుట్టిందని ఆరోపిస్తున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఆమె గర్భంతో ఉండగా తీసిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో ఈ విషయం ఎప్పుడూ తమకు చెప్పలేదని..శిశువు సరిగా పెరగడం లేదన్న విషయాన్ని తమతో చెప్పలేదని, ఇది ముమ్మాటికీ వైద్యుల నిర్లక్ష్యమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.