ఒంటి కన్నుతో పిల్ల షార్క్….రాబోవు విపత్తులకు సంకేతామా?

  • Published By: Chandu 10tv ,Published On : October 22, 2020 / 04:27 PM IST
ఒంటి కన్నుతో పిల్ల షార్క్….రాబోవు విపత్తులకు సంకేతామా?

shark fish:  మన భూమిలో 70 శాతం సముద్రాలే అన్న మాట నిజమే. మెుదట జీవరాశి పుట్టింది నీటిలోనే అంటూ ఉంటారు. మనకు సముద్రాల్లో ఎప్పుడు వింత వింత జీవరాశులు కనిపిస్తూనే ఉంటాయి. ఇటీవల హిందూ మహా సముద్రంలో రెండు తలల చేపను చూసి ప్రజలు అబ్బురపడిన విషయం తెలిసిందే. తాజాగా ఇండొనేషియా సముద్రంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లకు ఒంటి కన్ను పిల్ల షార్క్ చేప కనిపించింది. దీని చూసిన జాలర్లుకు ఏంటీ ఈ వింత అంటూ ఆశ్చర్యపోయారు.



వివరాల్లోకి వెళ్తే… ఇండొనేషియా సముద్రంలో చేపలను వేటడానికి వెళ్లిన జాలర్లకు ఓ షార్క్ చేప చిక్కింది. అలా చిక్కిన చేప పొట్ట కోసి చూస్తే.. దాని కడుపులో మరో పిల్ల షార్క్ చేప కనిపించింది. అది కూడా చనిపోయింది. ఆ పిల్ల షార్క్ నోటిపైన రూపాయి బిల్లంత సైజులో ఒంటి కన్నుతో కనిపించింది. ఇలాంటి వింతలను మనం ఎక్కువగా కార్టూన్స్ లో చూస్తాం. ఇది ఏదో ప్రళయానికి సంకేతామా ఏంటీ? అంటూ ఫోటోలు తీసి క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిగో ఒంటి కన్ను చేప అంటూ ప్రచారం.



మాలుకూ ప్రావిన్స్ లో అక్టోబర్ 10, 2020న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ చేపను చూసిన పరిశోధకులు ఇది ‘సైక్లోప్స్’ రకానికి చెందినది కావచ్చు అంటున్నారు. దీని గురించి గ్రీకు పురాణాల్లో ‘సైక్లోప్స్’ చేప ఉండేదని, అది భారీ సైజులో ఉంటుంది. ఒంటి కన్నుతో చూస్తేనే వణుకు పుట్టేలా దాని రూపం ఉంటుందని అందులో వివరించారు.



ఆ చేప పిల్లను పరిశోధించిన సైంటిస్టులు దీనికి అరుదైన సైక్లోపియా సమస్య ఉందని తెలిపారు. ఈ సమస్య ఉన్న జీవులు గర్భంలో పెరిగే దశలోనే లోపాలతో పెరుగుతాయి. దీనితో పాటు ఆ చేపకు అల్బినో సమస్య కూడా ఉంది . అందువల్ల చర్మం తెల్లగా ఉందని తెలిపారు. ఈ చేపకు మెలనిన్ సరిగా ఉత్పత్తి జరగలేదు అని చెబుతున్నారు. 2011లో ను అమెరికా జాలర్లకు ఇలాంటి చేపనే కనిపించిందట.



తుఫానులు, ప్రళయాలు సంభవించేందుకు సంకేతాలుగా దేవుడు వాటిని పంపిస్తాడు అంటూ కొందరు అంటున్నా మాటలను సైంటిస్టులు కొట్టి పారేశారు. ఇలాంటి సమస్యలు ఉన్న జీవులు ఒకవేళ పుట్టినా, త్వరగానే చనిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే వాటికి ఉన్న సమస్యలే అవి జీవించేందుకు వీలు లేకుండా చేస్తాయి అంటున్నారు నిపుణులు.