Bipasha Basu: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ బ్యూటీ బిపాషా బసు

బాలీవుడ్‌లో బ్లాక్ బ్యూటీగా పేరుతెచ్చుకుని, తన అందచందాలతో యావత్ కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన బ్యూటీ బిపాషా బసు. అందాల ఆరబోత మొదలుకొని, ఘాటైన లిప్ లాక్‌ల వరకు ఏ విషయంలోనూ ‘తగ్గేదే లే’ అంటూ దూసుకెళ్లిన ఈ బ్యూటీ, తన కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా మల్చుకోవడంలో విజయం సాధించింది.

Bipasha Basu Gives Birth To A Baby Girl

Bipasha Basu: బాలీవుడ్‌లో బ్లాక్ బ్యూటీగా పేరుతెచ్చుకుని, తన అందచందాలతో యావత్ కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన బ్యూటీ బిపాషా బసు. అందాల ఆరబోత మొదలుకొని, ఘాటైన లిప్ లాక్‌ల వరకు ఏ విషయంలోనూ ‘తగ్గేదే లే’ అంటూ దూసుకెళ్లిన ఈ బ్యూటీ, తన కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా మల్చుకోవడంలో విజయం సాధించింది. ఒక సమయంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా కూడా బిపాషా నిలిచిందంటే అమ్మడు ఏ రేంజ్‌లో యూత్‌ను అట్రాక్ట్ చేసిందో అందరికీ తెలిసిందే.

Bipasha Basu : తల్లి కాబోతున్న బాలీవుడ్ బ్యూటీ.. సోషల్ మీడియాలో బేబీ బంప్ ఫోటోలు..

ఇక తన ప్రియుడు, నటుడు కరణ్ గ్రోవర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న బిపాషా అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చింది. కానీ పెళ్లి తరువాత అంతగా సక్సెస్‌ను అందుకోలేకపోయింది. దీంతో ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన బిపాషా, తాజాగా తన అభిమాలనుకు అదిరిపోయే న్యూస్ ఇచ్చింది. తమ కుటుంబంలో సభ్యుల సంఖ్య పెరిగిందని.. దేవీమా అనుగ్రహంతో తమకు పండంటి ఆడబిడ్డ జన్మించిందని కొద్దిసేపటి క్రితమే బిపాషా తన సోషల్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

బిపాషా తల్లి కావడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులుగా తమ జీవితంలో మరో మెట్టు పైకి ఎక్కిన బిపాషా, కరణ్ గ్రోవర్‌లకు పలువురు బాలీవుడ్ స్టార్స్ విషెస్ చెబుతున్నారు. ఇక ఇటీవల ఆలియా-రణ్‌బీర్ జోడీ కూడా ఆడపిల్లకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఏదేమైనా బాలీవుడ్‌లో వరుసగా సెలెబ్రిటీ కపుల్ తల్లిదండ్రులుగా ప్రమోట్ అవుతుండటంతో వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.