Bipasha Basu : తల్లి కాబోతున్న బాలీవుడ్ బ్యూటీ.. సోషల్ మీడియాలో బేబీ బంప్ ఫోటోలు..

బిపాషా బసు తన భర్త కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌తో కలిసి బేబీబంప్‌తో ఫోజులు ఇచ్చిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. ''మా జీవితంలోకి మరింత సంతోషం రానుంది. మా మధ్య ఉన్న ప్రేమ ఇప్పుడు...........

Bipasha Basu : తల్లి కాబోతున్న బాలీవుడ్ బ్యూటీ.. సోషల్ మీడియాలో బేబీ బంప్ ఫోటోలు..

Bipashabasu going to be a mother

Updated On : August 17, 2022 / 2:29 PM IST

Bipasha Basu :  తాజాగా బాలీవుడ్‌ డస్కీ బ్యూటీ బిపాషా బసు తాను తల్లికాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేసింది. ‘ఎలోన్‌’ సినిమాలో నటుడు కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌తో కలిసి నటించి అతనితో ప్రేమలో పడింది. కొన్ని నెలలు వీరిద్దరూ డేటింగ్‌ చేసి 2016లో పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజులుగా బిపాషా గర్భవతి అయినట్లు వార్తలు వినిపించాయి. కానీ దీనిపై ఈ జంట క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా తన భర్తతో కలిసి బేబీ బంప్ ఫోటోలని షేర్ చేస్తూ త్వరలోనే తల్లి కాబోతున్నాను అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Vijayendraprasad : RSS పై సినిమాతో పాటు వెబ్ సిరీస్ తీస్తాను అంటూ విజయేంద్రప్రసాద్ ప్రకటన

బిపాషా బసు తన భర్త కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌తో కలిసి బేబీబంప్‌తో ఫోజులు ఇచ్చిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. ”మా జీవితంలోకి మరింత సంతోషం రానుంది. మా మధ్య ఉన్న ప్రేమ ఇప్పుడు ముగ్గురుగా కాబోతున్నాం. త్వరలోనే మా బేబీ రానుంది. మా లైఫ్ లో మాకు సపోర్ట్ చేసిన వారందరికి, మాపై చూపించిన మీ ప్రేమ, అప్యాయతలకు కృతజ్ఞురాలిని” అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.