bjp: వైసీపీపై మా పార్టీ నేత స‌త్య‌కుమార్ చేసిన వ్యాఖ్య‌ల్లో నిజం లేదు: బీజేపీ అధిష్ఠానం

త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలో మద్దతు ఇవ్వాలని వైసీపీని తాము అడగలేదని బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధిష్ఠానం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. సత్యకుమార్‌ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్ స్ప‌ష్టం చేశారు.

Bjp

bjp: త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలో మద్దతు ఇవ్వాలని వైసీపీని తాము అడగలేదని బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధిష్ఠానం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. సత్యకుమార్‌ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్రపతి ఎన్నికలో వైఎస్సార్‌సీపీ మద్దతు కోరలేదంటూ సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని చెప్పారు. ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో బీజేపీ అధిష్ఠానం వ్యక్తిగతంగా సంప్రదింపులు జరిపిందని అన్నారు.

salt: అద‌నంగా ఉప్పు తీసుకునే వారికి అకాల మ‌ర‌ణ ముప్పు

నామినేషన్‌ దాఖలు సమయంలో ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కూడా హాజరై, మద్దతు తెలిపారని గుర్తుచేశారు. కాగా, తమ పార్టీ జాతీయ నాయకత్వం కూడా వైసీపీ మద్దతు కోరలేదని స‌త్యకుమార్ తాజాగా ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. అంతేగాక‌, కేంద్ర మంత్రుల వెనుక వైసీపీ నేత‌లు నిల్చొని ఫొటోల్లో కనిపిస్తూ బీజేపీతో కలిసి ఉన్నామనే భ్రమను ప్రజల్లో కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయ‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు.