Mamata
west bengal: ప్యాక్ లేదా లేబుల్ చేసిన ఆహార పదార్థాలపై కేంద్ర ప్రభుత్వం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధిస్తుండడంపై దేశంలోని ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇవాళ కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ”ఇప్పుడు మరమరాలపై కూడా జీఎస్టీ విధిస్తున్నారు. మిఠాయిలు, లస్సీ, పెరుగుపై కూడా జీఎస్టీ ఉంది. ప్రజలు ఏమి తినాలి? రోగులు ఆసుపత్రుల్లో చేరిన సమయంలో కూడా జీఎస్టీ ఉంటోంది” అని మమతా బెనర్జీ అన్నారు. బీజేపీ పాలన వల్ల దేశంలో రూపాయి మారకం విలువ చరిత్రలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోందని ఆమె విమర్శించారు.
”అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీయేతర పార్టీల ప్రభుత్వాలను పడగొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇదే బీజేపీ నేతల పనిగా మారింది. పశ్చిమ బెంగాల్‌లోనూ ఆ ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమైంది. టీఎంసీ ర్యాలీ నిర్వహిస్తోన్న ఈ ప్రాంతంలో వానపడుతోంది. అయినప్పటికీ, మన మద్దతుదారులు ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదు” అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. కాగా, దేశంలో పెరిగిపోతోన్న ధరలపై టీఎంసీ నిరసనలు తెలిపింది. ధరలు తగ్గించి ఆదుకోవాలని ప్లకార్లులు ప్రదర్శించింది.
National Herald case: రాహుల్, ప్రియాంకతో ఈడీ ఆఫీసుకు సోనియా.. విచారణ షురూ