National Herald case: రాహుల్‌, ప్రియాంక‌తో ఈడీ ఆఫీసుకు సోనియా.. విచార‌ణ షురూ

నేష‌న‌ల్ హెరాల్డ్ దిన‌ప‌త్రిక‌కు సంబంధించిన న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విచార‌ణ ఎదుర్కొంటున్నారు. తన కుమార్తె, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీతో కలిసి ఆమె ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాల‌యానికి వెళ్ళారు. అనంత‌రం సోనియా కుమారుడు, ఎంపీ రాహుల్ గాంధీ కూడా అక్క‌డ‌కు వ‌చ్చారు. సోనియా గాంధీని ఈడీ విచారిస్తుండ‌డంపై కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న‌లు తెలుపుతున్నారు.

National Herald case: రాహుల్‌, ప్రియాంక‌తో ఈడీ ఆఫీసుకు సోనియా.. విచార‌ణ షురూ

Sonia Gandhi

National Herald case: నేష‌న‌ల్ హెరాల్డ్ దిన‌ప‌త్రిక‌కు సంబంధించిన న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విచార‌ణ ఎదుర్కొంటున్నారు. తన కుమార్తె, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీతో కలిసి ఆమె ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాల‌యానికి వెళ్ళారు. అనంత‌రం సోనియా కుమారుడు, ఎంపీ రాహుల్ గాంధీ కూడా అక్క‌డ‌కు వ‌చ్చారు. సోనియా గాంధీని ఈడీ విచారిస్తుండ‌డంపై కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న‌లు తెలుపుతున్నారు. ప‌లు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వ‌హించారు.

ప‌లు ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్ళారు. సోనియా గాంధీని ఈడీ విచారిస్తోన్న తీరుపై రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గ‌హ్లోత్ మండిప‌డ్డారు. సోనియా వ‌య‌సు 70 ఏళ్ళు దాటింద‌ని, ఆమె ఇంటికే ఈడీ అధికారులు వెళ్ళి విచారించి ఉంటే బాగుండేద‌ని చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థ‌ల గురించి ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారో తాను ఈడీ, సీబీఐ అధికారుల‌కు త్వ‌ర‌లోనే తెలుపుతాన‌ని అన్నారు. తాము శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్నామ‌ని, త‌మ గ‌ళాన్ని ఎవ‌రూ అణ‌చివేయ‌లేర‌ని కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా చెప్పారు.

Maharashtra: శివ‌సేనలో చీలిక‌లు రావ‌డానికి సంజ‌య్ రౌతే కార‌ణం: రామ్‌దాస్‌ అథ‌వాలే