Karnataka Elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నాహాలు.. 21 నుంచి పర్యటనలు చేస్తామన్న యెడియూరప్ప

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. ఈ నెల 21 నుంచే తాము కర్ణాటక వ్యాప్తంగా పర్యటనలు జరుపుతామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యెడియూరప్ప తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది మేలో జరగాల్సి ఉంది. ఇవాళ యెడియూరప్ప కుటుంబ సభ్యులతో కలిసి ఏపీలోని కర్నూలు జిల్లాలోని మంత్రాయాన్ని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తాను ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని యెడియూరప్ప తెలిపారు.

Karnataka Elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. ఈ నెల 21 నుంచే తాము కర్ణాటక వ్యాప్తంగా పర్యటనలు జరుపుతామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యెడియూరప్ప తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది మేలో జరగాల్సి ఉంది. ఇవాళ యెడియూరప్ప కుటుంబ సభ్యులతో కలిసి ఏపీలోని కర్నూలు జిల్లాలోని మంత్రాయాన్ని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… తాను ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని యెడియూరప్ప తెలిపారు.

అయితే, బీజేపీ విజయం కోసం తాను పనిచేస్తానని, కర్ణాటకలో తమ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తానని అన్నారు. బీజేపీ అధిష్ఠానం ఒప్పుకుంటే తన కుమారుడు ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలిపారు. ఈ నెల 21 నుంచే కర్ణాటకలో పర్యటనలు చేపడతామని, ఏ ప్రాంతం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని యెడియూరప్ప చెప్పారు. బీజేపీకి చెందిన నాలుగు బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాయని అన్నారు. ప్రతి డివిజన్లోనూ తమ పార్టీ పర్యటనలు జరుపుతుందని చెప్పారు.

కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై స్థానంలో కొత్త ముఖ్యమంత్రిగా ఇతర నేత బాధ్యతలు స్వీకరిస్తారా? అన్న అంశంపై యెడియూరప్ప స్పందిస్తూ… ఇప్పట్లో ఎలాంటి మార్పులూ చోటుచేసుకోబోవని తాను భావిస్తున్నట్లు తెలిపారు. బస్వరాజ్ బొమ్మ సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని ఆయన చెప్పారు. ఆయనను బాధ్యతల నుంచి తప్పిస్తారని జరుగుతోన్న ప్రచారంలో నిజం లేదని అన్నారు. బీజేపీలో తనను పట్టించుకోవట్లేదని వస్తోన్న ప్రచారంలో కూడా నిజం లేదని యెడియూరప్ప చెప్పారు.

Raksha bandhan Gift: తమ్ముడికి కాలేయంలోని కొంత భాగాన్ని ఇచ్చి ప్రాణాలు కాపాడిన అక్క 

ట్రెండింగ్ వార్తలు