Raksha bandhan Gift: తమ్ముడికి కాలేయంలోని కొంత భాగాన్ని ఇచ్చి ప్రాణాలు కాపాడిన అక్క 

 కాలేయంలోని కొంత భాగాన్న తన తమ్ముడికి ఇచ్చి అతడి ప్రాణాలు కాపాడింది ఓ అక్క. రక్షా బంధన్ వేళ ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. గుజరాత్, ద్వారకలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఇవాళ ఇందుకు సంబంధించిన వివరాలను ఓ ప్రకటనలో తెలిపింది. పూజా జైన్ (43) తన కాలేయంలోని కొంత భాగాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. పూజా జైన్ కాలేయంలోని కొంత భాగాన్ని ఆమె తమ్ముడికి అమర్చుతూ వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు.

Raksha bandhan Gift: తమ్ముడికి కాలేయంలోని కొంత భాగాన్ని ఇచ్చి ప్రాణాలు కాపాడిన అక్క 

Raksha bandhan Gift

Raksha bandhan Gift: కాలేయంలోని కొంత భాగాన్ని తన తమ్ముడికి ఇచ్చి అతడి ప్రాణాలు కాపాడింది ఓ అక్క. రక్షా బంధన్ వేళ ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. గుజరాత్, ద్వారకలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఇవాళ ఇందుకు సంబంధించిన వివరాలను ఓ ప్రకటనలో తెలిపింది. ఓ వ్యక్తి (40) కాలేయ వైఫల్యంతో బాధపడుతున్నాడు. అతడు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చాడని వైద్యులు చెప్పారు. కాలేయ వ్యాధి బాగా ముదిరిపోయిందని తెలిపారు.

అంతేగాక, అతడు అధిక బరువు ఉన్నాడని, కాలేయ మార్పిడి కూడా చాలా క్లిష్టతరమని చెప్పారు. అతడికి మూడు నెలల్లో శస్త్రచికిత్స నిర్వహించకపోతే బతకడని వైద్యులు తెలిపారు. దీంతో అతడి పూజా జైన్ (43) తన కాలేయంలోని కొంత భాగాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. పూజా జైన్ కాలేయంలోని కొంత భాగాన్ని ఆమె తమ్ముడికి అమర్చుతూ వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు.

కాలేయంలోని కొంత భాగాన్ని దానం చేసిన పూజా జైన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ”నా తమ్ముడే నాకు సర్వస్వం. రక్షా బంధన్ రోజున విలువైన బహుమతి ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా తమ్ముడి ఆరోగ్యం గురించి నేను, నా కుటుంబం కొన్ని నెలలుగా చాలా బాధ పడుతున్నాం. నా తమ్ముడి ప్రాణాలు కాపాడినందుకు వైద్యులకు కృతజ్ఞతలు” అని చెప్పింది. ఈ శస్త్రచికిత్సకు ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చిందని, చివరకు విజయవంతమైందని వైద్యులు అన్నారు.
Viral video: కొడవలితో వెంటపడ్డ డీఎంకే కౌన్సిలర్ భర్త.. భయంతో పరుగులు తీసిన యువకులు