BJP MLA Raja Singh Challenges MP Asaduddin Owaisi, Mahabooba Mufti, CM Mamata Banerjee
BJP MLA Raja Singh Challenges : భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతుంది. దీనిని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలను నిర్వహిస్తుంది. దీంట్లో భాగంగా అందరి ఇళ్లపైనా మువ్వన్నెల జెండా ఎగురవేయాలనే పిలుపులో భాగంగా హైదరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తన ఇంటిపై జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా రాజాసింగ్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మహబూబా ముఫ్తీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలకు సవాల్ విసిరారు. మీరు నిజమైన దేశ భక్తులు అయితే జాతీయ జెండాను ఎగురవేసి..సెల్యూట్ చేయాలి అంటూ సవాల్ విసిరారు.
Mehbooba Mufti : త్రివర్ణ పతాకాన్ని కాషాయ జెండాగా మార్చాలని బీజేపీ యత్నిస్తోంది : మెహబూబా ముఫ్తీ
కాగా ఇప్పటికే ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రతీ ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి… మోదీ, అమిత్ షాలు దాన్ని చూడాలని పిలుపునిచ్చారు అసదుద్దీన్.కాగా..పౌరసత్వ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 8 రాష్ట్రాలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అమలు చేయడానికి ఏమాత్రం సిద్ధంగా లేవు. పౌరసత్వ చట్టాన్ని ఎంఐఎం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కేంద్రంపై పలు విమర్శలు చేస్తోంది.
ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టిన MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ… ప్రతీ ముస్లిం ఇంటిపైనా జాతీయ జెండా ఎగరాలని పిలుపిచ్చారు. ఆ త్రివర్ణ పతాకాన్ని ప్రధాన మంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షాలు చూడాలని కోరారు. పౌరసత్వ చట్టం ద్వారా ముస్లింలను అణచివేయాలని కేంద్ర ప్రభుత్వం ఎత్తుగడలు వెయ్యడం సరికాదన్నఒవైసా ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. దాన్ని రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. NRC కూడా అసంబద్ధమైనదేనన్న ఆయన… దేశంలో ఎంత మందికి పాస్‌పోర్ట్ ఉందో కేంద్రం చెప్పాలని నిలదీశారు.