Mehbooba Mufti : త్రివర్ణ పతాకాన్ని కాషాయ జెండాగా మార్చాలని బీజేపీ యత్నిస్తోంది : మెహబూబా ముఫ్తీ

భారత జాతీయ త్రివర్ణ పతాకాన్ని కాషాయ జెండాగా మార్చాలని బీజేపీ యత్నాలు చేస్తోంది అంటూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తీవ్ర విమర్శలు చేశారు.

Mehbooba Mufti : త్రివర్ణ పతాకాన్ని కాషాయ జెండాగా మార్చాలని బీజేపీ యత్నిస్తోంది  : మెహబూబా ముఫ్తీ

BJP will make India a religious country, replace tricolour with saffron flag

Mehbooba Mufti : భారత జాతీయ త్రివర్ణ పతాకాన్ని కాషాయ జెండాగా మార్చాలని బీజేపీ యత్నాలు చేస్తోంది అంటూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తీవ్ర విమర్శలు చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మెహబూబా ముఫ్తీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బ్యానర్ పట్టుకుని ‘కాలే దిన్ కా కాల నిశయ్ నహీ చలేగా, కశ్మీర్ సమస్యను పరిష్కరించండి’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ముఫ్తీ మాట్లాడుతూ భారత జాతీయ జెండా అయిన త్రివర్ణ పతాకాన్ని కాషాయ పతాకంగా మార్చేందుకు బీజేపీ యత్నిస్తోందని అంటూ బీజేపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.

భారత రాజ్యాంగ పునాదులను, సెక్యులరిజంను కూడా బీజేపీ నాశనం చేస్తుంద అంటూ దుయ్యబట్టారు. భారత్ ను మతపరమైన దేశంగా మార్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది అంటూ విమర్శించారు. జమ్మూకశ్మీర్ కు ఉన్న ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక ప్రతిపత్తి, ప్రత్యేక జెండాను తొలగించినట్లుగానే..భారత జాతీయ త్రివర్ణ పతాకాన్ని కూడా మార్చేస్తారు అని అన్నారామె.

కశ్మీర్ లో తాము తిరిగి అధికారంలోకి వస్తే జమ్మూకశ్మీర్ రాజ్యాంగాన్ని..ప్రత్యేక ప్రతిపత్తిని వెనక్కి తీసుకొస్తామని మెహబూబా ఈ సందర్భంగా తెలిపారు. కశ్మీర్ కోసం లక్షలాది మంది ప్రాణాలను త్యాగం చేశారని… తాము అధికారంలోకి వస్తే కశ్మీర్ సమస్యను పరిష్కరించటానికి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని అన్నారు.

2019 ఆగస్ట్ 5వ తేదీన ఆర్టికల్ 370ని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జమ్మూకశ్మీర్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. అసెంబ్లీ కలిగిన యూటీగా జమ్మూకశ్మీర్ ను, అసెంబ్లీ లేని యూటీగా లడఖ్ ను ఏర్పాటు చేసింది.