vice-presidential candidate: ఉప రాష్ట్రప‌తి ఎన్డీఏ అభ్య‌ర్థి రేసులో నిలిచిన నేత‌లు వీరే

బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు స‌మావేశం కాసేప‌ట్లో ప్రారంభం కానుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్య‌ర్థిగా ఎవ‌రిని నిల‌బెట్టాల‌న్న అంశంపై నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఎన్డీఏ అభ్యర్థి రేసులో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, కేంద్ర మాజీ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ, కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మ‌ద్ ఖాన్, పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, రాజ్యసభ మాజీ స‌భ్యుడు వినయ్ సహస్ర బుద్దే ఉన్నారు

Venkaiah Naidu

vice-presidential candidate: బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు స‌మావేశం కాసేప‌ట్లో ప్రారంభం కానుంది. ప్ర‌ధాని మోదీతో పాటు బీజేపీ కీల‌క నేత‌లు ఇందులో పాల్గొన‌నున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్య‌ర్థిగా ఎవ‌రిని నిల‌బెట్టాల‌న్న అంశంపై నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఎన్డీఏ అభ్యర్థి రేసులో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, కేంద్ర మాజీ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ, కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మ‌ద్ ఖాన్, పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, రాజ్యసభ మాజీ స‌భ్యుడు వినయ్ సహస్ర బుద్దే ఉన్నారు.

Maharashtra: ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్ల మార్పు.. ‘మ‌హా’ కేబినెట్ కీల‌క‌ నిర్ణయాలు

ఆగస్టు 10తో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి పదవీకాలం ముగియ‌నుంది. నూతన ఉప రాష్ట్రపతిని 788 మంది లోక్ సభ, రాజ్యసభ స‌భ్యులు ఎన్నుకోనున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో సునాయాసంగా ఎన్డీఏ అభ్యర్థి గెలిచే అవ‌కాశం ఉంది. సొంతంగా బీజేపీకి లోక్ సభలో 303 మంది, రాజ్యసభలో 92 ఎంపీలు ఉన్నారు. ఎన్డీఏ అభ్యర్థి గెలుపొందుతారని తెలిసినా తమ అభ్యర్థిని ఉపరాష్ట్రపతి ఎన్నిక బరిలో నిలిపే యోచనలో విపక్షాలు ఉన్నాయి.

Chidambaram: ఇలాగేనా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను న‌డిపేది?: చిదంబరం

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు రెండు భిన్న భావజాలాలకు మధ్య జరుగుతున్న పోటీగా భావిస్తున్నాయ‌ని విపక్ష పార్టీల నేత‌లు అంటున్నారు. పోటీ అనివార్యం అయితేనే ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జ‌ర‌గ‌నుంది. జూలై 19 వ‌ర‌కు నామినేషన్లు స్వీక‌రిస్తారు. జూలై 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. జూలై 22 నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేదీ. ఆగస్టు 6న సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఉదయం 10 నుంచి 5 గంటల వరకు పోలింగ్ జ‌రుగుతుంది. పార్లమెంట్ భవనం మొదటి అంతస్తులోని రూమ్ నంబ‌రు.63లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది.