Maharashtra: ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్ల మార్పు.. ‘మ‌హా’ కేబినెట్ కీల‌క‌ నిర్ణయాలు

మ‌హారాష్ట్రలోని ఏక్‌నాథ్ షిండే కేబినెట్‌ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. నేడు ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో స‌మావేశ‌మైన‌ మ‌హారాష్ట్ర కేబినెట్.. ఔరంగాబాద్ పేరును ఛ‌త్ర‌ప‌తి సాంబాజీన‌గ‌ర్‌గా, ఉస్మానాబాద్ పేరును ధారాశివ్‌గా మార్చాల‌ని నిర్ణ‌యించింది.

Maharashtra: ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్ల మార్పు.. ‘మ‌హా’ కేబినెట్ కీల‌క‌ నిర్ణయాలు

Eknath Shinde Orders So Protocal To His Convoy

Maharashtra: మ‌హారాష్ట్రలోని ఏక్‌నాథ్ షిండే కేబినెట్‌ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. నేడు ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో స‌మావేశ‌మైన‌ మ‌హారాష్ట్ర కేబినెట్.. ఔరంగాబాద్ పేరును ఛ‌త్ర‌ప‌తి సాంబాజీన‌గ‌ర్‌గా, ఉస్మానాబాద్ పేరును ధారాశివ్‌గా మార్చాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు పేర్లు మార్చేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ ప్ర‌తిపాద‌న‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వానికి పంప‌నుంది. ఔరంగాబాద్ పేరును మార్చాల‌ని సాంబాజీన‌గ‌ర్‌గా మార్చాల‌ని ఎన్నో ఏళ్ళుగా డిమాండ్ ఉన్న విష‌యం తెలిసిందే.

Viral Video: భలే ఆడుకుంది.. సముద్రగర్భంలో స్కూబా డ్రైవర్‌తో ఓ ఆటాడుకున్న ఆక్టోపస్.. వీడియో వైరల్

మ‌హారాష్ట్ర స‌ర్కారు దీనిపై నేడు నిర్ణయం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. అలాగే, నావీ ముంబైలోని కొత్త విమానాశ్ర‌యానికి డీబీ పాటిల్ పేరు పెట్టాల‌ని ఏక్‌నాథ్ షిండే కేబినెట్ నిర్ణ‌యించింది. కాగా, ఇవే నిర్ణ‌యాలను గ‌త నెల జూన్ 29న అప్ప‌టి మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే నేతృత్వంలో కేబినెట్ కూడా తీసుకున్న విష‌యం విదిత‌మే. రాజీనామా చేయ‌డానికి ముందు ఉద్ధ‌వ్ ఆ నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఇప్పుడు అవే నిర్ణ‌యాల‌ను ఏక్‌నాథ్ షిండే కేబినెట్ కూడా తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఔరంగాబాద్‌, ఉస్మానాబాద్ పేర్ల‌ను మార్చ‌డానికి సంబంధించిన ప్ర‌క్రియ కొనసాగ‌నుంది.