Viral Video: భలే ఆడుకుంది.. సముద్రగర్భంలో స్కూబా డ్రైవర్‌తో ఓ ఆటాడుకున్న ఆక్టోపస్.. వీడియో వైరల్

లోతైన సముద్రగర్భం అద్భుతమైన జీవులతో నిండి ఉంటుంది. వీటిని చూసేందుకు రెండు కళ్లు చాలవు. వింత ప్రపంచంలోకి వెళ్లినట్లుగా ఉంటుంది. సముద్రపు లోతుల్లో అత్యంత విశేషమైన జీవి ఆక్టోపస్.

Viral Video: భలే ఆడుకుంది.. సముద్రగర్భంలో స్కూబా డ్రైవర్‌తో ఓ ఆటాడుకున్న ఆక్టోపస్.. వీడియో వైరల్

Viral Video

Viral Video: లోతైన సముద్రగర్భం అద్భుతమైన జీవులతో నిండి ఉంటుంది. వీటిని చూసేందుకు రెండు కళ్లు చాలవు. వింత ప్రపంచంలోకి వెళ్లినట్లుగా ఉంటుంది. సముద్రపు లోతుల్లో అత్యంత విశేషమైన జీవి ఆక్టోపస్. ఇది ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ గా ఉంటుంది. తాజాగా ఓ సముద్ర గర్భంలో స్కూబా డ్రైవర్ ఆక్టోపస్ తో ఆడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను బ్యూటెంటేబిన్ అనే వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఉల్లాసభరితమైన చిన్న ఆక్టోపస్.. చివరి వరకు చూడండి అంటూ శీర్షిక ఇచ్చాడు.

cuddle therapy: అతడి కౌగిలికి యమ డిమాండ్.. గంటకు రూ. 7వేలు..!!

సముద్రపు అడుగు భాగానికి వెళ్లిన స్కూబా డ్రైవర్ ఆక్టోపస్ ను చూశాడు. దాని వద్దకు వెళ్లి అరచేతిని అడ్డుగా పెట్టాడు. దీంతో ఆక్టోపస్ స్పందించి చేతివైపుకు దూసుకొచ్చింది. అలా అరచేతితో తాకుతూ వెళ్లూ.. కొద్దిసేపు ఆక్టోపస్ స్కూబా డ్రైవర్ తో ఆడుకోవటం మనం వీడియోలో చూడొచ్చు. కొద్దిసేపటి తరువాత ఆక్టోపస్ అతడి చేతిపైకి వచ్చింది. అతడు దానిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నట్లు వీడియోలో ఉంది.

ఈ వీడియోను ట్విటర్ లో 1.9 మిలియన్ల మంది వీక్షించారు. 96,000 కంటే ఎక్కువ లైక్‌లు రాగా, 13,000 కంటే ఎక్కువ పోస్టులు వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేశారు. ఓ నెటిజన్.. “ఆక్టోపస్ అతనిని కౌగిలించుకుంది !!! నేను దీన్ని ప్రేమిస్తున్నాను,” అని రాశాడు. ఇలా నెటిజన్లు చమత్కారంతో కూడిన కామెంట్లు చేస్తున్నారు.