cuddle therapy: అతడి కౌగిలికి యమ డిమాండ్.. గంటకు రూ. 7వేలు..!!

ఇంగ్లాండ్ లోని బ్రిస్టల్ కు చెందిన 30ఏళ్ల ట్రెజర్ అనే వ్యక్తి కౌగిలించుకోవటాన్నే వ్యాపారంగా మల్చుకున్నాడు. అతని లక్ష్యం ఎవరూ లేరు అనుకొని మానసికంగా, ఒంటరి తనంతో బాధపడుతున్న వారికి ఆనందాన్ని ఇవ్వడమే. ఇందుకోసం గంటకు రూ.7వేలు వసూళ్లు చేస్తాడు.

cuddle therapy: అతడి కౌగిలికి యమ డిమాండ్.. గంటకు రూ. 7వేలు..!!

Cuddle Therapy (2)

cuddle therapy: ఆధునిక సమాజంలో బంధుత్వాలకు ప్రాధాన్యత తగ్గిపోయింది.. నా అనుకునేవారు కరువవుతున్నారు. కొందరికి స్నేహితులు కూడా ఉండరు.. వీరు ఎప్పుడూ ఒంటరి తనంలో మగ్గిపోతుంటారు. మానసికంగా కృంగిపోతుంటారు. వారి ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు.. అలాంటి వారి సంఖ్య సమాజంలో రోజురోజుకు పెరిగిపోతోంది. బంధాలు, బంధుత్వాలకు విలువనిచ్చే భారత దేశంలో వీరి సంఖ్య చాలా తక్కువే. ఫారెన్ కంట్రీస్ లో వీరి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి వారికి ట్రెజర్ అనే వ్యక్తి నేనున్నానంటున్నాడు. ఒక్క గంట కౌగిలించుకొని వారి బాధను దూరంచేస్తున్నాడు.

Hugh

ఇంగ్లాండ్ లోని బ్రిస్టల్ కు చెందిన 30ఏళ్ల ట్రెజర్ అనే కౌగిలించుకోవటాన్నే వ్యాపారంగా మల్చుకున్నాడు. ట్రజెర్ రోబోటిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీర్. ప్రొడక్ట్, క్లయింట్ మేనేజర్‌గా విభిన్న విభాగాల్లో ఉద్యోగం చేశాడు. ప్రస్తుతం అతని లక్ష్యం ఎవరూ లేరు అనుకొని మానసికంగా, ఒంటరి తనంతో బాధపడుతున్న వారికి ఆనందాన్ని ఇవ్వడమే. అదీ ఎలాగంటే కౌగిలించుకోవటం ద్వారా. గంటసేపు కౌగిలించుకొని వారి ఇబ్బందిని తీర్చితే గంటకు 75 ఫౌండ్లు (భారత కరెన్సీలో రూ. 7వేలు) చార్జ్ చేస్తాడు. ప్రస్తుతం అతను దానినే వృత్తిగా ఎంచుకున్నాడు. ట్రెజర్ ప్రొఫెసనల్ కడల్ థెరఫీ(Professional cuddle therapy)గా మారిపోయాడు.

Cuddle Therapy11

తన మనసులోని భావాల్ని ఇతరులతో పంచుకోలేక ఒంటరితనం అనుభవిస్తున్న వారికి భరోసా కల్పించేలా ట్రజెర్ ప్రయత్నిస్తున్నాడు. అతడిని సంప్రదించగానే ఇంటికి వచ్చి బాధితుడిని దగ్గరకు తీసుకుంటాడు. కౌగిలించుకొని వారు చెప్పింది వింటాడు. తల నిమురుతూ ఆందోళన తగ్గేలా చేస్తాడు. ఇందుకోసం అతడు గంటకు 7వేలు తీసుకుంటాడు. చిన్న వారి నుంచి ముసలివారి వరకు ఇలా ఆడ, మగ అనే తేడాలేకుండా ట్రెజర్ కోరుకున్న వారికి తన కౌగిలిని అందిస్తూ వారి ఒంటరి తనాన్ని దూరం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.