Chidambaram: ఇలాగేనా ఆర్థిక వ్యవస్థను నడిపేది?: చిదంబరం
భారత్ నుంచి ఎగుమతులు తగ్గడం, దేశంలో పెరిగిపోయిన ద్రవ్యోల్బణం రేటు, విదేశీ పెట్టుబడులు వేరే దేశాలకు వెళ్ళిపోతుండడం వంటి అంశాలు రూపాయి మారకం ధర పడిపోతుండడాన్ని సూచిస్తున్నాయని చిదంబరం అన్నారు. మనదేశ ఆర్థిక వ్యవస్థ ఏ మేరకు "మూల్యం" చెల్లించుకుంటుందో ప్రస్తుత రూపాయి మారకం విలువను చూస్తే తెలుస్తోందని ఆయన చెప్పారు.

Chidambaram
Chidambaram: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రోజురోజుకీ పడిపోతుండడం, నిరుద్యోగం, ఎల్పీజీ ధర, ద్రవ్యోల్బణం పెరుగుదల వంటి అంశాలపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ గురువారం రూ.79.99కి చేరింది. శుక్రవారం 8 పైసలు పెరిగి రూ.79.91కి చేరింది. ఆయా అంశాలను చిదంబరం తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
Maharashtra: ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్ల మార్పు.. ‘మహా’ కేబినెట్ కీలక నిర్ణయాలు
రూపాయి మారకం విలువ పడిపోతుండడం అంటే.. భారత్ నుంచి ఎగుమతులు తగ్గడం, దేశంలో పెరిగిపోయిన ద్రవ్యోల్బణం రేటు, విదేశీ పెట్టుబడులు వేరే దేశాలకు వెళ్ళిపోతుండడానికి సూచిక అని చిదంబరం అన్నారు. మనదేశ ఆర్థిక వ్యవస్థ ఏ మేరకు “మూల్యం” చెల్లించుకుంటుందో ప్రస్తుత రూపాయి మారకం విలువను చూస్తే తెలుస్తోందని ఆయన చెప్పారు. భారతీయ రిజర్వు బ్యాంకు నియంత్రించాల్సిన అంశాల్లో ఇది ఒకటని ఆయన అన్నారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రాథమిక అంశాలపై దృష్టిపెట్టి సమర్థంగా అమలు చేస్తేనే రపాయి విలువ పెరుగుతుందని చెప్పారు.
దేశంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన భారత్‌లోని నిరుద్యోగ సంక్షోభ నివారణకు ఏ విధంగానూ ఉపయోగపడదని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన అగ్నిపథ్ పథకం కింద ఉద్యోగాల్లో చేరడానికి భారీగా దరఖాస్తులు వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.
Viral Video: భలే ఆడుకుంది.. సముద్రగర్భంలో స్కూబా డ్రైవర్‌తో ఓ ఆటాడుకున్న ఆక్టోపస్.. వీడియో వైరల్
అగ్నిపథ్ పథకం ద్వారా తాత్కాలిక ఉద్యోగాలు మాత్రమే వస్తుండడం, నాలుగేళ్ళ తర్వాత ఎటువంటి ప్రయోజనాలూ అందకపోవడం వంటి అంశాలు ఉన్నప్పటికీ యువత ఇంత భారీ సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటుండడాన్ని చూస్తే దేశంలో నిరుద్యోగం ఎంతగా ఉందో అర్థమవుతుందని చిదంబరం విమర్శించారు. భారత వైమానిక దళంలో కేవలం 3,000 పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇస్తే 7,50,000 దరఖాస్తులు వచ్చాయని ఆయన అన్నారు. సంక్షోభ సమయంలోనూ సామాన్య ప్రజల గురించి ఏమీ ఆలోచించకుండా కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ ధరలు పెంచేసిందని ఆయన విమర్శించారు.