Presidential polls: రాష్ట్రపతి ఎన్నిక పోటీ నుంచి యశ్వంత్ సిన్హా తప్పుకోవాలి: అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్

''రాష్ట్రప‌తి ఎన్నిక బ‌రి నుంచి య‌శ్వంత్ సిన్హా త‌ప్పుకోవాల‌ని నేను కోరుతున్నాను. ఎందుకంటే ద్రౌప‌ది ముర్ముకు మ‌ద్ద‌తుగా దేశంలోని అనేక‌ పార్టీల నుంచి చాలా మంది ఎస్సీలు, ఎస్టీ స‌భ్యులు నిలుస్తున్నారు'' అని ఆయ‌న చెప్పారు.

Presidential polls: రాష్ట్రపతి ఎన్నిక పోటీ నుంచి యశ్వంత్ సిన్హా తప్పుకోవాలి: అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్

Prakash Ambedkar

Presidential polls: రాష్ట్రప‌తి ఎన్నిక నుంచి విప‌క్షాల అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హా త‌ప్పుకోవాల‌ని వంచిత్‌ బహుజన్‌ ఆఘాడీ (వీబీఏ) పార్టీ జాతీయ అధ్యక్షుడు, డా.బీఆర్‌.అంబేద్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ అన్నారు. ఈ నెల 18నే రాష్ట్రప‌తి ఎన్నిక జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నెల 21న కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ఎన్డీఏ నుంచి ద్రౌప‌ది ముర్ము, విప‌క్ష పార్టీల అభ్య‌ర్థిగా య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్లు దాఖ‌లు చేశారు.

Maharashtra: ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్ల మార్పు.. ‘మ‌హా’ కేబినెట్ కీల‌క‌ నిర్ణయాలు

ఈ నేప‌థ్యంలో ప్ర‌కాశ్ అంబేద్క‌ర్ మీడియాతో మాట్లాడుతూ.. ”రాష్ట్రప‌తి ఎన్నిక బ‌రి నుంచి య‌శ్వంత్ సిన్హా త‌ప్పుకోవాల‌ని నేను కోరుతున్నాను. ఎందుకంటే ద్రౌప‌ది ముర్ముకు మ‌ద్ద‌తుగా దేశంలోని అనేక‌ పార్టీల నుంచి చాలా మంది ఎస్సీలు, ఎస్టీ స‌భ్యులు నిలుస్తున్నారు” అని ఆయ‌న చెప్పారు. కాగా, ఎన్డీఏలోని పార్టీలే కాకుండా దేశంలోని అనేక ప్రాంతీయ పార్టీలు కూడా ద్రౌప‌ది ముర్ముకు మ‌ద్ద‌తు ఇచ్చాయి. దీంతో ద్రౌప‌ది ముర్ము బలం ఇప్ప‌టికే 61 శాతానికి చేరిందని అంచ‌నా. ఆమెకు వ‌చ్చే మొత్తం ఓట్ల విలువ 6.67 లక్షలుగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రప‌తి ఎన్నిక‌లో మొత్తం ఓట్ల విలువ 10,86,431గా ఉంది.