Tarun Chugh Trailer Comments : బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఓ ఎమ్మెల్యే, ఏఐసీసీ అధికార ప్రతినిధి చేరిక ట్రైలరే అన్న తరుణ్ చుగ్ కామెంట్స్ తో ఇతర పార్టీల్లో కలకలం రేగింది. ఆదివారం దాసోజు శ్రవణ్ బీజేపీలో చేరారు. ఇక ఈ నెల 21న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. బీజేపీలో చేరికలు ఇంతటితో ఆగవంటున్నారు. మరికొంతమంది పేర్లు కూడా వినిపిస్తుండే సరికి.. చుగ్.. ట్రైలర్ వ్యాఖ్యలు, బండి సంజయ్ వ్యాఖ్యలు నిజమేనా అనే చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది.
10 నుంచి 12మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతలోనే బీజేపీలోకి చేరికలు మొదలయ్యాయి. దీంతో ఆ పది పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఎవరు అనే దానిపై చర్చ జరుగుతోంది. దానిపై టీఆర్ఎస్ ప్రధానంగా దృష్టి సారించింది. ఇటు కాంగ్రెస్ కూడా కలవరపడుతోంది. బీజేపీలోకి చేరికలన్నీ ఈ నెల 21నే ఉంటాయా? లేక మరింత సమయం తీసుకుంటారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Telangana BJP : తెలంగాణలో సైలెంట్‌గా కల్లోలం సృష్టిస్తున్న బీజేపీ.. అధికారమే లక్ష్యంగా వ్యూహాలు
ఎవరి ఊహకూ అందని ఎమ్మెల్యేలు, నేతలు బీజేపీలో చేరనున్నారని కమలనాథులు అంటున్నారు. ఇక, ఇప్పటికే బీజేపీలో చేరే పలువురి నేతల పేర్లూ ఖరారయ్యాయి. ఇందులో సిద్ధిపేట నుంచి మురళీ యాదవ్.. వరంగల్ నుంచి రాజయ్య యాదవ్, ఎర్రబెల్లి ప్రదీప్ రావ్.. పెద్దపల్లి నుంచి పెద్దాపూర్ సురేశ్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయంగా ఉంది.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw