Telangana BJP : తెలంగాణలో సైలెంట్‌గా కల్లోలం సృష్టిస్తున్న బీజేపీ.. అధికారమే లక్ష్యంగా వ్యూహాలు

సైలెంట్ గా ఉంటూనే అధికార, విపక్ష పార్టీల్లో కల్లోలం సృష్టిస్తోంది కమలం పార్టీ. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కేడర్ లో కలవరం నింపింది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఆపరేషన్ ఆకర్ష్ కు పదును పెట్టి వచ్చిన వారిని వచ్చినట్టే కమలం తన క్యాంపులోకి తరలిస్తోంది. రండి రండి అంటూ వెల్ కమ్ చెబుతోంది.

Telangana BJP : తెలంగాణలో సైలెంట్‌గా కల్లోలం సృష్టిస్తున్న బీజేపీ.. అధికారమే లక్ష్యంగా వ్యూహాలు

Telangana BJP : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ముందుగా పార్టీని బలోపేతం చేసే పనిలో పడింది. అందులో భాగమే ఆపరేషన్ ఆకర్ష్. ఇతర పార్టీల్లోని కీలక నేతలు, అసంతృప్తులకు బీజేపీ గాలం వేస్తోంది. వారిలో చర్చలు జరిపి పార్టీలోకి లాగేస్తోంది.

ఒక్క ముక్కలో చెప్పాలంటే.. సైలెంట్ గా ఉంటూనే అధికార, విపక్ష పార్టీల్లో కల్లోలం సృష్టిస్తోంది కమలం పార్టీ. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కేడర్ లో కలవరం సృష్టిస్తోంది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఆపరేషన్ ఆకర్ష్ కు పదును పెట్టి వచ్చిన వారిని వచ్చినట్టే కమలం తన క్యాంపులోకి తరలిస్తోంది. రండి రండి అంటూ వెల్ కమ్ చెబుతోంది.

BJP Leader Ttarun Chugh :బీజేపీలోకి చేరికల లిస్ట్ చాలాఉంది..ఇది ట్రైలర్ మాత్రమే..సినిమా ముందుంది..

వారం రోజులుగా రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కొనసాగుతుండగా.. బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చారు. ఇదే విషయం బీజేపీ చీఫ్ బండి సంజయ్ అంతకముందే చెప్పారు. రాజగోపాల్ రెడ్డితో పాటు చాలామంది కమలం క్యాంపులోకి వస్తారని అన్నారు. ఆయన చెప్పినట్లే జరుగుతోంది. కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి రగడ కొనసాగుతుండగానే.. కాంగ్రెస్ మరో కీలక నేత దాసోజు శ్రవణ్ తాను కూడా సెపరేట్ అవుతున్నా అంటూ బాంబు పేల్చారు. పీసీసీ లీడర్ షిప్ పై నిప్పులు చెరిగారు. నాయకత్వం నచ్చకే పార్టీ వీడుతున్నట్టు ప్రకటించారు.

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక పార్టీని ప్రైవేట్ ఫ్రాంచైజీగా మార్చారని తీవ్ర విమర్శలు గుప్పించారు దాసోజు శ్రవణ్. ఉద్యమంలో గట్టిగా కొట్లాడిన ఉద్యమకారుల్లో మొదటి వరుసలో ఉంటారు దాసోజు శ్రవణ్. మంచి స్పోక్స్ పర్సన్, ప్రస్తుత రాజకీయాలపై గట్టి పట్టున్న లీడర్. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన ఆయన.. టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు.

Komatireddy Raj Gopal Reddy: వాళ్ళు టీఆర్ఎస్‌లోకి వెళ్తే ఎవ్వ‌రూ మాట్లాడ‌లేదు.. నాపై మాత్రం నిందలా?: రాజ‌గోపాల్ రెడ్డి

నిన్నటివరకు కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కొనసాగారు. సోనియా, రాహుల్ దృష్టిలో ఉన్నారు. కానీ, రేవంత్ రెడ్డి వ్యవహారశైలి ఆయనకు నచ్చక వైదొలిగారు. చెప్పా పెట్టకుండా పార్టీలో చేరికలు, సొంత నిర్ణయాలు, ఒకే నియోజకవర్గంలో ఐదారుగురు లీడర్లను ప్రోత్సహిస్తూ టిక్కెట్ల కొట్లాట్లకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు దాసోజు శ్రవణ్. ఈ అసంతృప్తిని క్యాచ్ చేసుకుంటోంది బీజేపీ.

శ్రవణ్ తో చర్చలు జరిపి పార్టీలోకి వెల్ కమ్ చెప్పారు బండి సంజయ్. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై రిపోర్ట్ ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లారు బండి సంజయ్. ఆయన వెంట శ్రవణ్ ను కూడా తీసుకెళ్లారు. బీజేపీ అగ్ర నాయకులు జేపీ నడ్డా, అమిత్ షాలను శ్రవణ్ కలవనున్నారు. ఈ నెల 21న మునుగోడులో జరిగే సభకు ఆహ్వానించడంతో పాటు మునుగోడులో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపైనా ఢిల్లీ పెద్దలతో చర్చలు జరపనున్నారు. పాదయాత్ర జరుగుతున్న తీరు, తెలంగాణలో రాజకీయ పరిణామాల గురించి కూడా హైకమాండ్ తో చర్చలు జరపనున్నారు బండి సంజయ్.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

దాసోజు శ్రవణ్ ను ఢిల్లీ పెద్దలకు పరిచయం చేయడంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి తమతో ఎవరెవరు టచ్ లో ఉన్నారు? ఆయా పార్టీలలో ఉన్న అసంతృప్త నేతలు బీజేపీలోకి వస్తే రాజకీయంగా పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉంటుంది అన్న అంశాలను కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. మునుగోడుపై ఫుల్ ఫోకస్ పెట్టిన బీజేపీ.. రాజగోపాల్ రెడ్డిని గెలిపించి నాలుగో ఆర్ ను అసెంబ్లీకి పంపడమే లక్ష్యంగా పెట్టుకుంది. దాంతో పాటు రాష్ట్రంలోని ముఖ్య నేతలను పార్టీలోకి జాయిన్ చేసుకుని తెలంగాణ భవిష్యత్తు బీజేపీతోనే అనే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది. బీజేపీలో చేరికలతో పార్టీలో బలం పుంజుకోవడంతో పాటు మునుగోడులో గెలుపు ఈజీ అవుతుందని, దాంతో ఫైనల్ ఎలక్షన్స్ లో అధికారమే లక్ష్యంగా రెట్టించిన ఉత్సాహంతో పోరాడవచ్చనేది బీజేపీ ప్లాన్.