BJP Leader Ttarun Chugh :బీజేపీలోకి చేరికల లిస్ట్ చాలాఉంది..ఇది ట్రైలర్ మాత్రమే..సినిమా ముందుంది..

కాంగ్రెస్ నేతలు పార్టీకి హ్యాండిచ్చి బీజేపీలో చేరుతున్న క్రమంలో బీజేపీ నేత తరుణ్ చుక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బీజేపీలోకి ఇంకా చాలామంది నేతలు చేరుతారు ఇది ట్రైలర్ మాత్రమే సినిమా ముందుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.

BJP Leader Ttarun Chugh :బీజేపీలోకి చేరికల లిస్ట్ చాలాఉంది..ఇది ట్రైలర్ మాత్రమే..సినిమా ముందుంది..

BJP leader Tarun chugh

BJP leader Tarun chugh : ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన బీజేపీలో చేరటానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. దీంట్లో భాగంగానే కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కూడా కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చారు. బీజేపీ చేరటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీని కోసం తెలంగాణబీజేపీ చీఫ్ బండి సంజయ్ తో కలిసి ఢిల్లీ వెళ్లారు. తెలంగాణ బీజేపీ బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ని కలిసారు.

ఈ సందర్భంగా తరుణ్ చుక్ మాట్లాడుతూ..తెలంగాణలోని పరిస్థితులపై చర్చించామని బీజేపీలోకి ఇంకా చాలామంది నేతలు చేరుతారని తెలిపారు. దాసోజు శ్రవణ్ బీజేపీలోకి చేరటం అనేది చాలా సంతోషించాల్సిన విషయం అని..శ్రవణ్ మా విద్యార్థి పరిషత్ లో పనిచేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీజేపీలోకి ఇంకా చాలామంది నేతలు చేరుతారని ఇది ట్రైలర్ మాత్రమేనని సినిమా ముందు ఉంది అని అన్నారు.

తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం దోచుకుని తింటోందంటూ విమర్శించారు. తెలంగాణను ఎంతో అభివృద్ధి చేస్తారని నమ్మకంతో టీఆర్ఎస్ ను గద్దెనెక్కించిన ప్రజల నమ్మకాన్ని కేసీఆర్ వమ్ము చేశారని..అందుకే తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు గుడ్ బై చెప్పనున్నారని..తెలంగాణ ఇ:టెలిజెన్స్ రిపోర్టులు కూడా కేసీఆర్ కు ఇదే చెప్పాయని అన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అంటూ ధీమా వ్యక్తంచేశారు. నేతలను డబ్బుచ్చి కొనుక్కునే సంస్కృతి బీజేపీకి లేదని..తెలంగాణ ఉద్యమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రవణ్ లు కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు.

కాగా..తెలంగాణలో వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న క్రమంలో ఆయా పార్టీల నేతలు ఇప్పటినుంచి జంపింగ్ కార్యక్రమాల్లో బిజి బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఉన్న పార్టీని వీడితే ఏపార్టీలోకి వెళ్లాలి? ఏపార్టీలోకి వెళితే తమ రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది?అనే వ్యూహాల్లో ఉన్నారు. దీంట్లో భాగంగానే తెలంగాణలోని పార్టీల నేతలు ఏ పార్టీలోకి ఎవరు? ఎప్పుడు? చేరతారో తెలికుండా ఉంది. ఇటువంటి పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో పలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితి అయోమయంగా మారింది. ఎవరు పార్టీలోకి వస్తున్నారో..ఎవరు పార్టీని ఎప్పుడు వీడుతారో తెలియని గందరగోళం నెలకొంది.