Komatireddy Raj Gopal Reddy: వాళ్ళు టీఆర్ఎస్‌లోకి వెళ్తే ఎవ్వ‌రూ మాట్లాడ‌లేదు.. నాపై మాత్రం నిందలా?: రాజ‌గోపాల్ రెడ్డి

 టీఆర్ఎస్‌లోకి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్తే ఎవ్వ‌రూ మాట్లాడ‌లేదని, త‌న‌పై మాత్రం నింద‌లు ఎందుకు వేస్తున్నార‌ని కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి నిల‌దీశారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... నైతిక విలువ‌లు పాటిస్తూ రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్తున్నానని ఆయ‌న అన్నారు. చండూరు స‌భ‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు వింటే బాధేసిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో అనుమానాలు భ‌రించ‌లేక పార్టీని వీడానని అన్నారు.

Komatireddy Raj Gopal Reddy: వాళ్ళు టీఆర్ఎస్‌లోకి వెళ్తే ఎవ్వ‌రూ మాట్లాడ‌లేదు.. నాపై మాత్రం నిందలా?: రాజ‌గోపాల్ రెడ్డి

Komatireddy Rajagopal Reddy

Komatireddy Rajagopal Reddy: టీఆర్ఎస్‌లోకి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్తే ఎవ్వ‌రూ మాట్లాడ‌లేదని, త‌న‌పై మాత్రం నింద‌లు ఎందుకు వేస్తున్నార‌ని కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి నిల‌దీశారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… నైతిక విలువ‌లు పాటిస్తూ రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్తున్నానని ఆయ‌న అన్నారు. చండూరు స‌భ‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు వింటే బాధేసిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో అనుమానాలు భ‌రించ‌లేక పార్టీని వీడానని అన్నారు.

మునుగోడును టీఆర్ఎస్ స‌ర్కారు అభివృద్ధి చేయ‌ట్లేదని కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విమ‌ర్శించారు. ఇప్పుడు ఉప ఎన్నిక వ‌స్తుంద‌ని మునుగోడులో రోడ్లు వేస్తున్నారని, అలాగే, సర్వేలు చేస్తున్నారని ఆయ‌న అన్నారు. మంత్రి కేటీఆర్‌ను అడిగినా మునుగోడులో ఇంత‌వ‌ర‌కు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌లేదని ఆయ‌న చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల‌ను కేసీఆర్ క‌ల‌వ‌రని ఆయ‌న చెప్పారు. త‌న‌ ప‌ద‌వి త్యాగం చేస్తానని, త‌న‌ నియోజ‌క వ‌ర్గానికి నిధులు ఇవ్వాల‌ని కోరానని చెప్పారు.

తాను పోటీ కూడా చేయ‌కుండా టీఆర్ఎస్ అభ్య‌ర్థినే గెలిపిస్తాన‌ని అన్నానని కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. త‌న‌ డ‌బ్బుల‌తో మునుగోడులో అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టానని తెలిపారు. త‌న త‌ల్లి పేరిట ఉన్న ఫౌండేష‌న్ నుంచి సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నాన‌ని అన్నారు. తాను ఎమ్మెల్యేగా కొన‌సాగేందుకు ఇంకా ఏడాదిన్న‌ర కాలం ఉందని, అయినా రాజీనామా చేస్తున్నాన‌ని తెలిపారు. మోదీ వ‌ల్లే దేశాభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌ని ఆలోంచించి ఈ నిర్ణ‌యం తీసుకున్నానని తెలిపారు.

Weather update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మ‌ళ్ళీ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం