Brahmaji indirect counter to Anasuya
Brahmaji : ఆర్టిస్ట్ బ్రహ్మాజీ చాలా సరదాగా ఉంటారు. సినిమాల్లో క్యారెక్టర్స్ తో ప్రేక్షకులని ఎంతలా మెప్పిస్తారో బయట కూడా చాలా సరదాగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటారు. ఇక సోషల్ మీడియాలో తనదైన స్టైల్ లో అప్పుడప్పుడు పోస్టులు చేస్తూ ఉంటారు. ఇటీవల బ్రహ్మాజీ ఓ సరదా సెల్ఫీ తీసుకొని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ సెల్ఫీ వెరైటీగా ఉండటంతో పలువురు నెటిజన్లు దీనిపై కామెంట్స్ చేశారు.
అయితే ఓ నెటిజన్ ఈ ఫోటోకి ఏం లేదు అంకుల్ అని కామెంట్ చేశాడు. దీనికి బ్రహ్మాజీ రిప్లై ఇస్తూ.. ”అంకుల్ ఏంట్రా అంకుల్.. అంకుల్ అంటే కేసు వేస్తా, బాడీ షేమింగ్ చేస్తున్నావని” అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఇటీవల అనసూయని కొంతమంది నెటిజన్లు ఆంటీ అన్నందుకు పోలీసు కేసు పెడతా అని ఎంత రచ్చ చేసిందో అందరికి తెలిసిందే. అనసూయ ఇచ్చిన రిప్లైలకి నెటిజన్లు మరింత రెచ్చిపోయి ఆంటీ.. ఆంటీ.. అంటూ ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు.
Hero Suman : ఆ వార్తలపై సుమన్ సీరియస్..అసలు ఏమైంది?
ఇప్పుడు బ్రహ్మాజీ ఇలా అంకుల్ అంటే కేసు వేస్తా అని ట్వీట్ చేయడంతో అనసూయకి కౌంటర్ ఇచ్చాడు అని, కొంతమంది అనసూయని ట్యాగ్ చేస్తూ కామెంట్స్ చేశారు. మరి దీనికి అనసూయ రిప్లై ఇస్తుందేమో చూడాలి. మొత్తానికి ఈ ట్వీట్ మాత్రం వైరల్ గా మారింది.
Uncle entra.. uncle u.. case vestha.. age.. body.. shaming aa.. ? https://t.co/9fbRbXirbJ
— Brahmaji (@actorbrahmaji) August 30, 2022