Hero Suman : ఆ వార్తలపై సుమన్ సీరియస్..అసలు ఏమైంది?

హీరో సుమన్ తెలుగు సినిమాలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ఇటీవల కాలంలో హీరో సుమన్ ఏ సినిమాలోను కనిపించకపోవడంతో కొన్ని యూట్యూబ్ చానెల్స్ లో కొద్ది రోజులుగా అయన ఆరోగ్యం విషమంగా ఉందంటూ వీడియోలు కనిపిస్తున్నాయి. ఇక కొన్ని యూట్యూబ్ చానెల్స్ అయితే ఏకంగా ఆయన ఇకలేరంటూ...

Hero Suman : ఆ వార్తలపై సుమన్ సీరియస్..అసలు ఏమైంది?

Hero-Suman-Serious-about-fake-news...

Hero Suman : హీరో సుమన్ తెలుగు సినిమాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు. రాముడు అంటే ఎన్టీఆర్ గుర్తుకు వచ్చే తెలుగు ప్రజలకు, ఆ పాత్రలో ఎన్టీఆర్ తరువాత హీరో సుమన్ మాత్రమే ఒదగగలడు అని అనిపించుకున్న నటుడు. ఒకప్పుడు కథానాయకుడిగా చేసినప్పటికీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ మరియు ప్రతినాయకుడిగా నటిస్తూ వస్తున్నారు.

Suman : సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరూ హ్యాపీగా లేరు.. బయ్యర్స్ గురించి పట్టించుకోవట్లేదు..

ఇటీవల కాలంలో హీరో సుమన్ ఏ సినిమాలోను కనిపించకపోవడంతో కొన్ని యూట్యూబ్ చానెల్స్ లో కొద్ది రోజులుగా అయన ఆరోగ్యం విషమంగా ఉందంటూ వీడియోలు కనిపిస్తున్నాయి. ఇక కొన్ని యూట్యూబ్ చానెల్స్ అయితే ఏకంగా ఆయన ఇకలేరంటూ వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. అవి చూసిన సుమన్ సన్నిహితులు ఆందోళనతో ఆయన్ని సంప్రదించడంతో ఈ వార్తలు సుమన్ వరకు చేరాయి.

Suman : నేను రాజకీయాల్లోకి రాను..

దీంతో ఆగ్రహం చెందిన సుమన్ ఇటువంటి చర్యలకు మరోసారి పాల్పడితే సదరు యూట్యూబ్ ఛానల్స్ పై సైబర్ క్రైమ్ కింద కేసు ఫైల్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఏదేమైనా ఈ వార్తలు విన్న సుమన్ ఫాన్స్ ఇది నిజామా? అబద్దమా? అని చాలా ఆందోళనపడ్డారు. అయితే ఈ వార్తలో ఎటువంటి నిజం లేదు అని సుమన్ కొట్టిపారేశారు.