Uttar Pradesh : గుండెపోటుతో వధూవరులు మృతి.. ఒకే చితిపై దహనం చేసిన కుటుంబసభ్యులు
పెళ్లింట పందిరి అలానే ఉంది. వచ్చిన బంధువులు ఉన్నారు. అంతలోనే విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన కొన్ని గంటల్లోనే వధూవరులిద్దరూ గుండెపోటుతో చనిపోయారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన అందర్నీ కలిచివేసింది.
- Lakshmi 10tv
- Published On : June 5, 2023 / 11:27 AM IST
Uttar Pradesh
Uttar Pradesh : పెళ్లి జరిగి కొన్ని గంటలు కూడా గడవలేదు. కొత్త జంట గుండెపోటుతో చనిపోవడం అందర్నీ షాక్‌కి గురి చేసింది. ఉత్తరప్రదేశ్ లోని బహ్రైచ్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది.
Marriage prank video : స్నేహితుల ప్రాంక్‌తో పరేషాన్ అయిన కొత్త జంట.. వీడియో వైరల్
22 ఏళ్ల ప్రతాప్ యాదవ్ 20 ఏళ్ల పుష్పకి ఘనంగా పెళ్లి జరిగింది. కొత్త జంటని వరుడు ఇంటి వారు ఘనంగా ఆహ్వానించారు. అందరూ విందు ఆరగించి నిద్రపోయారు. తెల్లవారినా వధూవరులు తలుపు తెరిచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు తలుపులు పగలగొట్టి అక్కడి సీన్ చూసి షాకయ్యారు. పెళ్లికూతురు, పెళ్లికొడుకు విగత జీవులుగా పడి ఉండటం వారిని షాక్‌కి గురి చేసింది. . పెళ్లైన ఇల్లు విషాదంలో మునిగిపోయింది. ఇద్దరూ గుండెపోటుతో చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఇద్దరికీ ఒకే చితిపై అంత్యక్రియలు నిర్వహించారు.
marriage breakup : విడిపోయిన కొత్త జంట.. పెళ్లికూతురు చేసిన పని తెలిస్తే షాకవుతారు
భార్యాభర్తలిద్దరికీ ఒకేసారి గుండెపోటు వచ్చినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలిందని బహ్రైచ్ ఎస్పీ ప్రశాంత్ వర్మ తెలిపారు. అయితే ఈ జంటకు ఇంతకు ముందు గుండెకు సంబంధించిన ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని తెలుస్తోంది. ఈ జంట మరణాల మిస్టరీని ఛేదించేందుకు లక్నోలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో తదుపరి పరీక్షల కోసం ఇద్దరి మృతదేహాల లోపలి భాగాలను భద్రపరిచినట్లు వర్మ చెప్పారు. మొత్తానికి వధూవరుల మరణం మాత్రం మిస్టరీని తలపిస్తోంది.
