Bride final warning : వరమాల వేసేముందు పెళ్లికొడుక్కి పెళ్లికూతురు ఇచ్చిన ఫైనల్ వార్నింగ్.. ఏమై ఉంటుంది..?
వరమాల వేసేముందు ఓ పెళ్లకూతురు పెళ్లికొడుక్కి ట్విస్ట్ ఇచ్చింది. తను అడిగిన వాటికి సరేనంటే వరమాల వేస్తానంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ పెళ్లికొడుక్కి ఆమె ఇచ్చిన ఫైనల్ వార్నింగ్ ఏంటి? చదవండి.
- Lakshmi 10tv
- Published On : April 23, 2023 / 04:28 PM IST
Bride final warning
Bride final warning : పెళ్లిలో వధూవరులిద్దరికి ఉద్దేశించి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. జీవితకాలం కలిసి మెలసి అన్యోన్యంగా ఉంటామని పెళ్లినాటి ప్రమాణాలు చేసుకుంటారు. అయితే ఓ వివాహ వేడుకలో వరమాల వేయడానికి ముందు వధువు వరుడికి వార్నింగ్ ఇచ్చింది. ఏమై ఉంటుందా? అనుకుంటున్నారు కదా.. చదవండి.
Viral Video : షాకింగ్.. పెళ్లి మండపంలో రెచ్చిపోయిన పెళ్లికూతురు, తుపాకీతో కాల్పులు
వివాహ వేడుకలు ఎవరి సంప్రదాయాన్ని బట్టి వారు నిర్వహిస్తూ ఉంటారు. ఆడ,మగపెళ్లివారు ఒకరినొకరు సరదాగా ఆటపట్టించుకుంటారు. ఇటీవల కాలంలో కాస్త క్రియేటివిటీ జోడించి మరీ వేడుకలు చేస్తున్నారు. ఓ పెళ్లి వేడుకలో వధువు వరుడికి ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. అదేమై ఉంటుందా? అని అనుకుంటున్నారు కదా. వధూవరులిద్దరి చేతుల్లో పూలమాలలు ఉన్నాయి. వరుడి మెడలో దండ వేయడానికి ముందు వధువు ‘దండ వేయాలా?’ అని అడిగింది.. అందుకు వరుడు సరేనని తల ఊపాడు. ‘పక్కానా’ అని మళ్లీ ప్రశ్నించింది. ‘ నా కోసం నిలబడతావా?’ అని వరుడిని అడుగుతుంది. ‘ఇచ్చిన మాట మర్చిపోతే క్షమాపణ ఉండదు’ అంటుంది. ‘ మాట ఇచ్చి ఇక్కడి నుంచి తిరిగి వెళ్లలేవు.. బాగా ఆలోచించుకో..పక్కాగా వరలమాల వెళ్లమంటావా?’ అని మళ్లీ నిలదీసింది. ఆమె ప్రశ్నలన్నింటినీ చిరునవ్వుతో ఓపికగా విన్న వరుడు అన్నింటికి సరేనంటూ ఒప్పుకున్నాడు. అంతే ఆమె అతని మెడలో వరమాల వేసింది.
Rupert Murdoch: 92ఏళ్ల వయసులో ఐదో పెళ్లికి సిద్ధమైన బిలియనీర్.. పెళ్లికూతురు వయసు ఎంతంటే?
witty_wedding అనే పేజీ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోని షేర్ చేసారు. వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసి ‘సో క్యూట్’ అని కొందరు.. అతను ‘చాలా అదృష్టవంతుడు’ అని మరికొందరు వ్యాఖ్యానించారు. ఇది వారి సంప్రదాయమో.. లేక సరదాగా చేసిన ఘట్టమో తెలియదు కానీ పెళ్లికొడుకు మాత్రం అన్నింటికీ ఒప్పేసుకోవడం విశేషం.
