Viral Video : షాకింగ్.. పెళ్లి మండపంలో రెచ్చిపోయిన పెళ్లికూతురు, తుపాకీతో కాల్పులు

Viral Video: పెళ్లి కూతురు గాల్లోకి కాల్పులు జరుపుతున్న సమయంలో అక్కడే ఉన్నవారు వీడియో తీశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Viral Video : షాకింగ్.. పెళ్లి మండపంలో రెచ్చిపోయిన పెళ్లికూతురు, తుపాకీతో కాల్పులు

Viral Video (Photo : Google)

Viral Video : ఇటీవలి కాలంలో పెళ్లి వేడుకల్లో సరదగా వరుడు, వధువు చేసే పనులు శ్రుతి మించుతున్నాయి. వారి చర్యలు ఊహాకు అందడం లేదు. పాపులారిటీ కోసం చేస్తున్నారో పబ్లిసిటీ స్టంటో తెలియదు కానీ.. కొన్నిసార్లు పెళ్లి వేడుకల్లో కొత్త జంట చేసే పనులు వివాదాస్పదమవుతున్నాయి. విమర్శలకు తావిస్తున్నాయి. తాజాగా పెళ్లి మండపంలో నవవధువు చేసిన పని అందరినీ షాక్ కి గురి చేసింది. పెళ్లి మండపంలోనే పెళ్లి కూతురు తుపాకీతో కాల్పులు జరపడం కలకలం రేపింది.

ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హథ్రాస్ లోని సాలెంపూర్ లో జరిగింది. పెళ్లి మండపంలోనే పెళ్లి కూతురు తుపాకీ గాల్లోకి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపింది. ఆ తర్వాత తుపాకీని తన బంధువుకి ఇచ్చేసింది.

Also Read..Viral Video : ప్రాణాలకు తెగించే సాహసం.. నదిపై బైక్ నడిపిన వ్యక్తి వీడియో వైరల్

కాగా, ఆమె పక్కనే పెళ్లి కొడుకు ఉన్నాడు. కానీ, పెళ్లి కూతురుని అడ్డుకోలేదు. నాకెందుకులే భయ్యా అనుకున్నాడో, తనను ఎక్కడ షూట్ చేస్తుందోనని భయపడ్డాడో తెలియదు కానీ.. పెళ్లి కూతురు గన్ తో కాల్పులు జరుపుతుంటే.. పెళ్లి కొడుకు మౌనంగా ఉండిపోయాడు. చలనం లేని రాయిలా ఆమె పక్కనే కూర్చుని ఉండిపోయాడు.

Also Read..corona effect : 2 ఏళ్ల తర్వాత కాఫీ స్మెల్ గుర్తుపట్టిన మహిళ ఎమోషనల్ వీడియో వైరల్

పెళ్లి కూతురు గాల్లోకి కాల్పులు జరుపుతున్న సమయంలో అక్కడే ఉన్నవారు వీడియో తీశారు. దీంతో కాల్పుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వ్యవహారం పోలీసుల వరకు చేరింది. వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.

పెళ్లి మండపంలో వధువు చేసిన పని అక్కడున్న వారినే కాదు నెటిజన్లను కూడా షాక్ కి గురి చేసింది. కాగా, వివాహాలలో ఆయుధాలను ఉపయోగించడం చట్టవిరుద్ధం. అలా చేస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారు. ఈ విషయం తెలిసినా.. వధువు ఆ పని చేయడం వివాదాస్పదమైంది. పెళ్లి కూతురు చేసిన పనిని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాఫ్తు జరుపుతున్నారు. పొరపాటున గన్ మిస్ ఫైర్ అయి ఉంటే, ఎవరికైనా బుల్లెట్ తగిలి ఉంటే.. ఊహించని రీతిలో ఘోరం జరిగిపోయి ఉండేది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.