corona effect : 2 ఏళ్ల తర్వాత కాఫీ స్మెల్ గుర్తుపట్టిన మహిళ ఎమోషనల్ వీడియో వైరల్

కరోనా సోకిన సమయంలో చాలామంది రుచి, వాసన కోల్పోయారు. ట్రీట్మెంట్ తర్వాత మరల సాధారణ స్థితికి చేరుకుని అవి తిరిగి పొందిన వారున్నారు. అయితే 2 సంవత్సరాలుగా రుచి, వాసన కోల్పోయి తిరిగి పొందిన స్థితి ఎలా ఉంటుంది? ఓ మహిళ ఎమోషనలైన న్యూస్ చదవండి.

corona effect : 2 ఏళ్ల తర్వాత కాఫీ స్మెల్ గుర్తుపట్టిన మహిళ ఎమోషనల్ వీడియో వైరల్

covid effect

corona effect : ప్రపంచ వ్యాప్తంగా కరోనా (corona) వైరస్ బారిన పడి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ చాలామంది అనేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతూనే ఉన్నారు. కరోనా ఇంకా విజృంభిస్తూనే ఉంది. కరోనా సమయంలో చాలామంది రుచి, వాసన కోల్పోయారు. క్రమేణా తిరిగి కోలుకున్నారు. కోవిడ్ బారిన పడ్డ ఓ మహిళకు 2 సంవత్సరాలుగా రుచి, వాసన లేవట. రీసెంట్‌గా ఆమె కాఫీ వాసన గుర్తుపట్టి ఎమోషనల్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Corona Heart Attack : కరోనా సోకిన వారికి గుండెపోటుతోపాటు అనేక రోగాలు!

అమెరికాకు చెందిన జెన్నిఫర్ (Jennifer) అనే మహిళకు 2021లో కరోనా సోకింది. ఆ సమయంలో రుచి (taste), వాసన (smell) కోల్పోయింది. కోవిడ్ లక్షణాల నుంచి వారం తర్వాత ఆమె బయటపడినా రుచి, వాసనను మాత్రం పూర్తిగా కోల్పోయింది. క్లీవ్ ల్యాండ్ క్లినిక్ (Cleveland Clinic) రిపోర్ట్స్ ప్రకారం ఆమె పరోస్మియా (parosmia) మరియు డైస్గేసియా (dysgeusia) అనే పరిస్థితిని ఎదుర్కున్నదట. అందువల్లే దీర్ఘకాలం రుచి, వాసనను గుర్తించలేకపోయింది. ఆ సమయంలో ఆమెకు ఆహారం చెత్తలా అనిపించేదట. వాసన తెలియకపోవడంతో ఏది తినడానికైనా భయపడేదట. ఆఖరికి తన పెరట్లో పూసే పూల వాసనలు పీల్చడానికి కూడా ఆమె భయపడేదట. అలాంటి సమయంలో జెన్నిఫర్‌కి స్టెలేట్ గ్యాంగ్లియన్ బ్లాక్ (stellate ganglion block) (SGB) ఇంజెక్షన్ గురించి తెలిసిందట. ఈ ఇంజెక్షన్ (injection) మొదటి డోస్ తీసుకున్న తర్వాత జెన్నిఫర్ తనకెంతో ఇష్టమైన కాఫీ స్మెల్‌ని గుర్తించగలింది. వెంటనే ఎమోషనల్ అయిపోయింది. ఆ సమయంలో తీసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Corona Cases : దేశంలో మళ్లీ కరోనా విజృంభణ.. ఢిల్లీ, కేరళలో భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు

ఇక ఈ వీడియో చూసిన వారంతా రకరకాలుగా స్పందిస్తున్నారు. జెన్నిఫర్ తీసుకున్న ట్రీట్ మెంట్ డీటెయిల్స్ కావాలని కొందరు.. కోవిడ్ తర్వాత తాము కూడా వాసన, రుచిని కోల్పోయామని కొందరు అభిప్రాయపడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Cleveland Clinic (@clevelandclinic)