Tesla Model Y 2026 : లగ్జరీ ఫీచర్లతో ఇండియాలో టెస్లా కొత్త అవతారం.. 500 కి.మీ రేంజ్.. కొత్త లుక్ చూస్తే మైండ్ బ్లాక్!
Tesla Model Y 2026 : టెస్లా కొత్త 2026 మోడల్ Y ప్రీమియం రియర్-వీల్ కారు భారత మార్కెట్లో లాంచ్ అయింది. ప్రీమియం, ఫీచర్లతో అత్యంత ఆకర్షణీయంగా ఉందని కంపెనీ పేర్కొంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Tesla Model Y 2026 ( Image Credit : AI )
- టెస్లా మోడల్ Y ప్రీమియం RWD వేరియంట్ సుమారు 500కి.మీ రేంజ్
- ఈ ఎలక్ట్రిక్ SUV కొత్త వేరియంట్ ధర రూ. 50.89 లక్షలు
- కేవలం 5.9 సెకన్లలో 0 నుంచి 100కి.మీ స్పీడ్ అందుకోగలదు
Tesla Model Y 2026 : టెస్లా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి అమెరికన్ ఎలక్ట్రిక్ వెహికల్ దిగ్గజం టెస్లా నుంచి సరికొత్త 2026 మోడల్ Y ప్రీమియం ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది. ఈ రియర్-వీల్ డ్రైవ్ ఈవీ కారు అత్యంత ఆకర్షణీయంగా ఉంది.
పాపులర్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ వై మోడల్ మరింత ప్రీమియం, ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఈ టెస్లా ఈవీ కారు (Tesla Model Y 2026) ధర రూ. 50.89 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. ఈ కొత్త ప్రీమియం ఈవీ కారు డెలివరీలు జూలై 2026లో ప్రారంభమవుతాయి. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
ప్రీమియం SUV ఈవీ ఫీచర్లు :
కొత్త టెస్లా మోడల్ వై ప్రీమియం డిజైన్, టెక్నాలజీ అప్గ్రేడ్లతో వస్తుంది. ఈ కారు పూర్తిగా బ్లాక్ కలర్ ఇంటీరియర్ థీమ్, బ్లాక్ హెడ్‌లైనర్, కొత్త క్యాబిన్ ట్రిమ్ అందిస్తుంది. ఈ SUVకి మరింత ప్రీమియం డిజైన్ ఇస్తుంది.
ఈ కొత్త ఈవీలో భారీ 16-అంగుళాల టచ్‌స్క్రీన్, స్మూత్ యూజర్ ఇంటర్ఫేస్, ఫాస్ట్ రెస్పాండింగ్ సిస్టమ్, కొత్త జెన్ గ్రే ఇంటీరియర్ ఆప్షన్లు ఉన్నాయి. ప్రీమియం రియర్-వీల్ డ్రైవ్ వేరియంట్లో పనోరమిక్ సన్‌రూఫ్, ఫ్రంట్ సీట్లకు వెంటిలేషన్, బ్యాక్ సీట్లను పవర్ రిక్లైనింగ్, ఫోల్డింగ్ చేయడం, వైర్లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ప్రీమియం SUV ఈవీ రేంజ్, పర్ఫార్మెన్స్ :
టెస్లా కంపెనీ ప్రకారం.. WLTP సైకిల్ ఆధారంగా కొత్త మోడల్ వై ప్రీమియం సింగిల్ ఫుల్ ఛార్జ్‌పై 500 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ SUV కారు కేవలం 5.9 సెకన్లలో 0 నుంచి గంటకు 100కి.మీ వేగాన్ని అందుకోగలదు. ఇందులో ఐదుగురు వ్యక్తులు కూర్చోవచ్చు. బిలియనీర్ ఎలాన్ మస్క్ కంపెనీ ఈ కొత్త వేరియంట్ బ్యాటరీ కేపాసిటీని వెల్లడించలేదు.
WLTP ప్రకారం.. ఈ వేరియంట్ సుమారు 500 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. టాప్ స్పీడ్ సుమారు 201 కిలోమీటర్లు దూసుకెళ్లగలదు. టెస్లా ప్రకారం.. మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ వేరియంట్‌ను 175kW వరకు DC ఫాస్ట్ ఛార్జింగ్ రేటుతో సూపర్ఛార్జర్కు ఛార్జ్ చేయవచ్చు. తద్వారా కేవలం 15 నిమిషాల్లో 238 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది.
ఈ ఎలక్ట్రిక్ పవర్-ఫోల్డింగ్ సీట్లతో వస్తుంది. 2138 లీటర్ల వరకు స్టోరేజ్ స్పేస్‌ను అందిస్తుంది. ఈ మోడల్ వై ప్రీమియం, ఇటీవల లాంచ్ అయిన 6-సీటర్ మోడల్ వైఎల్ ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రముఖ సేఫ్టీ ఏజెన్సీల నుంచి అత్యుత్తమ సేఫ్టీ రేటింగ్లను పొందాయని టెస్లా పేర్కొంది.
ఈ సేఫ్టీ ఏజెన్సీలలో NHTSA, IIHS, యూరో NCAP, ANCAP,C-IASI ఉన్నాయి. ఈ కంపెనీ కస్టమర్లకు ఈజీ ఫైనాన్సింగ్ ఆప్షన్ కూడా అందిస్తోంది. టెస్లా మోడల్ వై ప్రీమియంను కేవలం రూ. 6 లక్షల డౌన్ పేమెంట్‌తో పొందవచ్చు. రూ.39,990 నుంచి ఈజీ ఈఎంఐతో కొనేసుకోవచ్చు. పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే కస్టమర్లు ఫ్యూయిల్, మెయింట్ నెన్స్ ఖర్చులపై నెలకు రూ. 20వేల వరకు ఆదా చేయవచ్చు.
