Justice For Sister: చెల్లికి న్యాయం చేయాలంటూ మళ్లీ ఢిల్లీ బాట పట్టిన అన్న

కొంతకాలంగా నవ్యతను భర్తతోపాటు, అత్తారింటి సభ్యులు పలు రకాలుగా వేధిస్తున్నారు. దీంతో నవ్యత భర్తతోపాటు, అత్త తరఫు కుటుంబంపై నాగ దుర్గారావు చందర్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, నవ్యత అత్తామామలు తమకున్న పలుకుబడి ఉపయోగించి కేసులో ఎలాంటి పురోగతి లేకుండా చేస్తున్నారు.

Justice For Sister: తన చెల్లెలికి న్యాయం చేయాలని కోరుతూ గత నెలలో ఎడ్లబండిపై ఢిల్లీ యాత్ర చేపట్టిన దుర్గారావు మరోసారి తిరిగి యాత్ర ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన నేలవెల్లి నాగ దుర్గారావు చెల్లెలు నవ్యతకు చందాపురం గ్రామానికి చెందిన కొంగర నరేంద్రనాథ్‌తో 2018లో వివాహం జరిగింది.

Donkey Milk Farm: ఐటీ జాబ్ వదిలి గాడిద పాల వ్యాపారం

పెళ్లి సమయంలో నాగ దుర్గారావు కుటుంబం కట్నకానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి చేసింది. అయితే, కొంతకాలంగా నవ్యతను భర్తతోపాటు, అత్తారింటి సభ్యులు పలు రకాలుగా వేధిస్తున్నారు. దీంతో నవ్యత భర్తతోపాటు, అత్త తరఫు కుటుంబంపై నాగ దుర్గారావు చందర్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, నవ్యత అత్తామామలు తమకున్న పలుకుబడి ఉపయోగించి కేసులో ఎలాంటి పురోగతి లేకుండా చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో తమకు న్యాయం జరగదని భావించిన దుర్గారావు.. ఢిల్లీ వెళ్లి సుప్రీంకోర్టులో, మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఎడ్లబండిపై ఢిల్లీకి బయలుదేరాడు. అయితే, గత నెలలో అలా ఎడ్లబండిపై రోడ్డు మార్గంలో ఢిల్లీ వెళ్తున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. దుర్గారావును పోలీసులు నందిగామ తీసుకొచ్చారు.

Uttam Kumar Reddy: కేసీఆర్‌కు బీజేపీతో రహస్య ఒప్పందం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఆ సమయంలో పోలీసులతోపాటు కలెక్టర్ కూడా వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, హామీ ఇచ్చి వారాలు గడుస్తున్నా ఎలాంటి న్యాయం జరగకపోవడంతో తిరిగి ఢిల్లీ బాట పట్టాడు. ఈ సారి రిక్షాలో ఢిల్లీ బయలుదేరాడు. రిక్షాకు సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ ఫొటో, జాతీయ జెండా రంగులు వేసుకున్నాడు. తన చెల్లెలికి ఎలాగైనా న్యాయం జరగాలని కోరుకుంటున్నాడు.

ట్రెండింగ్ వార్తలు